కోచ్‌ను తీసేయాలంటే అంత డ‌బ్బు ఇవ్వాల్సిందే.. పీసీబీ ఏం చేసిందంటే..?

తాత్కాలిక కోచ్ అజర్ మహమూద్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కోరుతోంది.

By Medi Samrat
Published on : 19 July 2025 8:30 PM IST

కోచ్‌ను తీసేయాలంటే అంత డ‌బ్బు ఇవ్వాల్సిందే.. పీసీబీ ఏం చేసిందంటే..?

తాత్కాలిక కోచ్ అజర్ మహమూద్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కోరుతోంది. అయితే, వారి ముందు ఒక పెద్ద సమస్య తలెత్తింది. పీసీబీ మహమూద్‌ను అతని పదవీకాలానికి ముందే పదవి నుండి తొలగిస్తే, అది 45 కోట్ల పాకిస్తాన్ రూపాయలను (1.38 కోట్ల భారతీయ రూపాయలు) కోల్పోవాల్సివుంటుంది.

కాంట్రాక్టు కింద మహమూద్‌ను గడువుకు ముందే పదవి నుండి తొలగిస్తే, బోర్డు అతనికి ఆరు నెలల జీతం పరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని పీసీబీ మూలాన్ని ఉటంకిస్తూ పిటిఐ పేర్కొంది. అందుకే ఇటీవల జాతీయ టెస్టు జట్టుకు తాత్కాలిక ప్రధాన కోచ్‌గా పీసీబీ నియమించింది.

అజార్ మహమూద్ ఒప్పందం వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో ముగుస్తుంది. ఈ మాజీ ఆల్ రౌండర్‌కు పీసీబీ ప్రతి నెలా దాదాపు రూ. 75 లక్షల (పాకిస్థానీ రూపాయిలు) జీతం చెల్లిస్తోంది. మూలం ప్రకారం.. ఇటీవల నియమించబడిన పరిమిత ఓవర్ల ప్రధాన కోచ్ మైక్ హెస్సన్ తనకు తన స్వంత సహాయక సిబ్బంది కావాలని.. అతడు మహమూద్‌ను ఇష్టపడటం లేద‌ని స్పష్టం చేయడంతో సమస్య వెలుగులోకి వచ్చింది.

దీంతో పీసీబీ పెద్ద సమస్య ఎదుర్కొంటోంది. మహమూద్‌ను ఎలా ఉపయోగించుకుంటారనేది పీసీబీ ముందున్న ప్రశ్న.. అయితే.. అతడికి ఇవ్వాల్సిన‌ భారీ మొత్తం చెల్లించడం బెట‌ర్ అనే వాద‌న కూడా విన‌వ‌స్తుంది. ఆరు నెలల జీతంతో అతడిని రిలీవ్ చేయాలని బోర్డు కోరుకోవ‌డం లేదు. అయితే.. సెలెక్టర్ల అధిపతి, జాతీయ క్రికెట్ ఆటగాడు ఆకిబ్ జావేద్ కూడా అజహర్ కోచింగ్ శైలి ఆకట్టుకోలేదంటున్నాడు.

మరోవైపు బోర్డు తీరుపై స్వయంగా అజరు హర్షం వ్యక్తం చేయడం లేదు. జాతీయ జూనియర్ జట్టు బాధ్యతలు ఇవ్వాలని మహమూద్ అభ్యర్థించారని, అయితే ఇందుకు అతను కొంతమంది పీసీబీ అంతర్గత వ్యక్తుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు.

ఛాంపియన్స్ కప్ ఈవెంట్‌లలో దేశీయ జట్లకు మెంటార్‌గా ఉన్న వారి కాంట్రాక్టుల నుండి వకార్ యూనిస్, సక్లైన్ ముస్తాక్, మిస్బా-ఉల్-హక్, సర్ఫరాజ్ అహ్మద్‌లను విడుదల చేయడానికి PCB భారీ మొత్తాలను చెల్లించాల్సి వచ్చిందని ఆ మూలం పేర్కొంది. అటువంటి పరిస్థితిలో PCB ప్రస్తుతం ఎలాంటి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు.

Next Story