అంత పెద్ద నోబాల్.. ఫిక్సింగ్ అనుమానాలు..!

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ అసద్ అక్తర్ వేసిన ఒక నో-బాల్ సోషల్ మీడియాలో దుమారం రేపింది

By -  Medi Samrat
Published on : 17 March 2026 9:10 PM IST

అంత పెద్ద నోబాల్.. ఫిక్సింగ్ అనుమానాలు..!

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ అసద్ అక్తర్ వేసిన ఒక నో-బాల్ సోషల్ మీడియాలో దుమారం రేపింది. పాకిస్థాన్ ఆటగాళ్లు మరోసారి స్పాట్ ఫిక్సింగ్ చేశారంటూ క్రికెట్ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. మార్చి 14న పాకిస్థాన్ దేశీయ ట్వంటీ20 క్రికెట్ పోటీ అయిన నేషనల్ టీ20 కప్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కరాచీ బ్లూస్, లాహోర్ బ్లూస్‌ మధ్య జరిగిన పోరులో ఈ రైట్-ఆర్మ్ పేసర్ తాను వేసిన ఒక ఓవర్‌లో 21 పరుగులు ఇచ్చాడు. అక్తర్ రెండు వైడ్‌లు, రెండు నో-బాల్‌లు వేశాడు. అతను వేసిన ఒక నో-బాల్‌లో, అక్తర్ ముందు పాదం బౌలింగ్ క్రీజ్‌కు చాలా దూరంలో ఉంది. 2010లో ఇంగ్లాండ్‌పై మహమ్మద్ అమీర్ వేసిన నో-బాల్‌తో పోల్చారు.

Next Story