ఒలింపిక్‌ రజత పతక విజేత.. ఇప్పుడు రెస్టారెంట్‌లో సర్వ్ చేస్తోంది! (వీడియో)

పారిస్‌ ఒలింపిక్స్‌ చైనా జిమ్నాస్ట్‌ పేరు ప్రధానంగా వినిపించింది.

By Srikanth Gundamalla  Published on  20 Aug 2024 9:34 AM GMT
olympic, gymnast yaqin, viral video, china restaurant,

ఒలింపిక్‌ రజత పతక విజేత.. ఇప్పుడు రెస్టారెంట్‌లో సర్వ్ చేస్తోంది! (వీడియో)

పారిస్‌ ఒలింపిక్స్‌ చైనా జిమ్నాస్ట్‌ పేరు ప్రధానంగా వినిపించింది. జౌ యాకిన్‌ 18 ఏళ్లకే ఒలింపిక్‌ మెడల్‌ గెలుచుకుని సంచలనంగా మారింది. చిన్న వయసులోనే పోడియంపై నొల్చొని అమాయకంగా తాను గెలుచుకున్న రజతం మెడల్‌ ముద్దాడుతుంటే ఈమె ఎవరా అంటూ అందరూ ఆరా తీశారు.

ఒలింపిక్స్‌లో మెడల్ సాధించి... ఇటీవలే చైనాలోని తన స్వదేశానికి చేరుకుంది జౌ యాకిన్. హునాన్‌ ప్రావిన్స్‌లో ఉన్న హెన్‌గ్యాంగ్‌ నగరంలో ఆమె కుటుంబం నివసిస్తోంది. వీరికి ఒక రెస్టారెంట్ ఉంది. ఒలింపిక్స్ టోర్నీ తర్వాత.. యంగ్ జిమ్నాస్ట్ ఇంటికి రాగానే ఎప్పటిలా తన పనిలో నిమగ్నమై పోయింది. రెస్టారెంట్ పనులు చేస్తూ బిజీగా మారిపోయింది. తల్లిదండ్రులకు సాయంగా ఉంటూ...తమ రెస్టారెంట్‌కు వస్తోన్న కస్టమర్లకు వడిస్తోంది. ఒలింపిక్స్‌ దుస్తుల్లోనే యాకిన్‌ సర్వ్ చేస్తుండటంతో కొందరు వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఇదే వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఒలింపిక్స్ మెడల్ గెలిచినా కూడా కొంత కూడా గర్వం లేకుండా.. యథావిధిగా రెస్టారెంట్‌లో చేసుకోవడంలో నిమగ్నమైన యాకిన్‌ను చూస్తే ముచ్చటగా ఉందంటున్నారు. నెటిజన్లు యాకిన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక వైపు జిమ్నాస్టిక్స్‌ ప్రాక్టీస్‌ చేస్తూనే.. మరోవైపు కుటుంబ బాధ్యతల్లో కూడా పాలు పంచుకోవడం ఆమె నిబద్ధతకు నిదర్శనమని అంటున్నారు సోషల్ మీడియా యూజర్లు.

కాగా.. 18 ఏళ్ల ఈ చైనీస్‌ అమ్మాయి పారిస్‌లోనే ఒలింపిక్స్‌కు అరంగేట్రం చేసింది. తన తొలి విశ్వక్రీడల్లోనే రజతం అందుకొని చరిత్రలో నిలిచిపోయింది. మహిళల బ్యాలెన్స్ బీమ్‌ ఈవెంట్‌లో అమెరికా స్టార్‌ జిమ్నాస్ట్‌ సైమన్‌ బైల్స్‌ను దాటి పతకాన్ని అందుకుంది. ఇక ఈ విభాగంలో ఇటలీకి చెందిన అలీస్‌ డిమాంటో స్వర్ణం, మనీలా ఎస్పోసిటో కాంస్య పతకాలను గెలుచుకున్నారు. ముగ్గూరు మెడల్స్ అందుకుంటున్న సమయంలో ఇటలీ జిమ్నాస్ట్‌లో తమ పతకాలను కొరికి ముద్దాడారు. దాన్ని చూసిన యాకిన్‌ ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత ఆమె కూడా వారిని అనుసరించి.. ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. యాకిన్ అమాయకంగా పెట్టిన ఎక్స్‌ప్రెషన్స్‌ వైరల్ అయ్యాయి.



Next Story