పానీ పూరీ అంటే నీరజ్‌కు చాలా ఇష్టం.. ప్రపంచ ఛాంపియన్ డైట్ ప్లాన్ ఎలా ఉందో తెలుసుకోండి..!
భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరోసారి వార్తల్లో నిలిచాడు.
By Medi Samrat Published on 28 Aug 2023 6:30 PM ISTభారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరోసారి వార్తల్లో నిలిచాడు. అథ్లెటిక్స్ స్టార్ నీరజ్ చోప్రా ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో కూడా స్వర్ణం సాధించాడు. అథ్లెట్‌గా ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడం అంటే అంత సులభం కాదు. హర్యానాలోని పానిపట్‌లో నివసించే నీరజ్ చిన్నతనంలో బాగా లావుగా ఉండేవాడు... కానీ ప్రస్తుతం ప్రపంచంలోని ఫిటెస్ట్ అథ్లెట్లలో నీరజ్ చోప్రా ఒకడు. తన లుక్స్, ఫిట్‌నెస్ కారణంగా నీరజ్ చోప్రా చాలా ఫేమస్ అయ్యాడు. నీరజ్ చోప్రా ఫిట్‌నెస్ గురించి.. ఎలాంటి డైట్ తీసుకుంటాడో తెలుసుకుందాం.
నీరజ్ చోప్రా ఒక ఇంటర్వ్యూలో తన డైట్ గురించి మాట్లాడుతూ.. తాను వారంలో ఎప్పుడైనా బ్రెడ్, ఆమ్లెట్ తింటానని చెప్పాడు. తను చాలా వంటకాలు వండుతాడని.. అయితే తాను చేసే నామ్‌కీన్ చావల్ (స్పైసీ రైస్) ను ప్రజలు వెజ్ బిర్యానీ అని పిలుస్తారని వెల్లడించారు. మ్యాచ్ రోజుల్లో కొవ్వుగా తినడానికి ఇష్టపడనని పేర్కొన్నాడు. సాధారణంగా సలాడ్ లేదా పండ్లు వంటి వాటిని తినడానికి ఇష్టపడతానని పేర్కొన్నాడు. వీటన్నింటితో పాటు గ్రిల్డ్ చికెన్ బ్రెస్ట్, ఎగ్స్ వంటి వాటిని కూడా ఇష్టపడతానని.. స్వీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అని.. ఇంట్లో తయారుచేసిన తాజా బ్రెడ్, నెయ్యితో చేసిన చుర్మా అంటే చాలా ఇష్టం అని వెల్లడించాడు.
సాల్మన్ ఫిష్ కూడా నీరజ్ డైట్‌లో భాగం. నీరజ్ కి నాన్ వెజ్ తినడమంటే ఇష్టం. ముఖ్యంగా గ్రిల్డ్ సాల్మన్ అంటే చాలా ఇష్టం. అలాగే తాజా పండ్ల రసాలను ఎక్కువగా తీసుకుంటానని వెల్లడించాడు. నీరజ్ రోజూ తన వ్యాయామం తర్వాత రెండు గ్లాసుల తాజా పండ్ల రసం తాగుతాడు. మరోవైపు నీరజ్ చోప్రా స్ట్రీట్ ఫుడ్‌లో పానీ పూరీని తినడానికి బాగా ఇష్టపడతాడు. పానీ పూరీని తింటే ఎలాంటి నష్టం ఉండదని.. ఎప్పుడైనా ఓ సారి గోల్ గప్పాలు తింటానని పేర్కొన్నాడు.