ఫిబ్రవరి 23న దుబాయ్‌లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే కాకుండా చిరకాల ప్రత్యర్థి భారత్‌ను ఓడించడమే పాకిస్థాన్‌కు అసలు కర్తవ్యమని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. అప్‌గ్రేడ్ చేసిన గడ్డాఫీ స్టేడియం ప్రారంభోత్సవ కార్యక్రమంలో షరీఫ్ మాట్లాడుతూ భారత్‌పై ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శనను తప్పక అందించాలని అన్నారు.
పాకిస్థాన్ కు చాలా మంచి జట్టు ఉంది. ఇటీవలి కాలంలో వారు బాగా రాణించారు, అయితే ఇప్పుడు అసలు పని ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే కాకుండా దుబాయ్‌లో జరగబోయే మ్యాచ్‌లో మా చిరకాల ప్రత్యర్థి అయిన భారత్‌ను ఓడించడమే.. దేశం మొత్తం వారికి వెన్నుదన్నుగా నిలుస్తోందని షరీఫ్ అన్నారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్‌కు భారత్ జట్టును పంపడానికి బీసీసీఐ నిరాకరించింది. దీంతో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ దుబాయ్ వేదికగా సాగనుంది.