Champions Trophy 2025 : భీకరమైన ఫామ్‌లో ఉన్నా.. పక్కకు పెడతారా.? ఆ ఇద్దరినే జట్టులోకి తీసుకుంటారా.?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టును మరికొన్ని రోజుల్లో ప్రకటించనున్నారు.
By Medi Samrat Published on 8 Jan 2025 9:06 AM ISTఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టును మరికొన్ని రోజుల్లో ప్రకటించనున్నారు. అన్ని జట్లు జనవరి 12 నాటికి టోర్నమెంట్ కోసం 15 మంది సభ్యుల మధ్యంతర (ఇది మారవచ్చు) జట్టును ప్రకటించాలి. అయితే ఫిబ్రవరి 13 వరకు ఈ జట్టులలో మార్పులు చేయవచ్చు. అటువంటి పరిస్థితిలో త్వరలో సెలెక్టర్లు భారత జట్టును ఎంపిక చేయడానికి సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. అయితే.. జట్టు ఎంపికకు ముందు 15 మంది సభ్యులతో కూడిన జట్టులో ఏ వికెట్‌కీపర్‌కు చోటు దక్కుతుందనేది పెద్ద ప్రశ్న. సంజూ శాంసన్‌ను మరోసారి ఉపేక్షిస్తారా.? అనే చర్చ నడుస్తోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టులో స్థానం కోసం రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ మధ్య పోటీ నెలకొంది. భారత జట్టులో సెలక్టర్లు ఇద్దరు వికెట్ కీపర్లకు మాత్రమే అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దురదృష్టకర వికెట్ కీపర్ ఎవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతేడాది అద్భుత ప్రదర్శన చేసి 3 సెంచరీలు చేసిన సంజూ శాంసన్ జట్టులో చోటు దక్కించుకోలేక పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
2023 వన్డే ప్రపంచకప్‌లో కేఎల్ రాహుల్ 75.33 సగటుతో 452 పరుగులు చేశాడు. దీంతో అతని స్థానం పదిలమే అని తెలుస్తుంది. ఇక రెండో వికెట్ కీపర్ కోసం పంత్, శాంసన్ మధ్య పోటీ నెలకొంది. ఇద్దరు ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ 2024లో జట్టులో ఉన్నారు. అయినప్పటికీ శాంసన్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే ఆ తర్వాత గతేడాదిలోనే శాంసన్ 3 సెంచరీలు చేసి తానేంటో నిరూపించుకున్నాడు. మరోవైపు గత రెండేళ్లలో పంత్ ఒక్క వన్డే మాత్రమే ఆడాడు. దీంతో ఏ వికెట్‌కీపర్‌కు చోటు దక్కుతుందోనని చర్చ తీవ్రంగా నడుస్తోంది. భారత జట్టులో రిషబ్ పంత్‌కు అవకాశం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వన్డేలలో కేఎల్ రాహుల్ ప్రదర్శన
మ్యాచ్‌లు- 77
ఇన్నింగ్స్‌లు- 72
రన్స్- 2851
సగటు- 49.15
స్ట్రైక్ రేట్- 87.56
సెంచరీలు - 7
హాఫ్ సెంచరీలు- 18
ఉత్తమ వ్యక్తిగత స్కోరు- 112
వన్డేలలో సంజూ శాంసన్ ప్రదర్శన
మ్యాచ్‌లు- 16
ఇన్నింగ్స్‌లు- 14
పరుగులు- 510
సగటు- 56.66
స్ట్రైక్ రేట్- 99.60
సెంచరీలు - 1
హాఫ్ సెంచరీలు- 3
ఉత్తమ వ్యక్తిగత స్కోరు- 108
వన్డేలలో రిషబ్ పంత్ అద్భుత ప్రదర్శన
మ్యాచ్‌లు- 31
ఇన్నింగ్స్‌లు - 27
పరుగులు- 871
సగటు- 33.50
స్ట్రైక్ రేట్- 106.21
సెంచరీలు - 1
హాఫ్ సెంచరీలు- 5
ఉత్తమ వ్యక్తిగత స్కోరు- 125*