ఓపెనర్ పాతుమ్ నిస్సాంక అద్భుతమైన అజేయ సెంచరీతో శ్రీలంక జట్టుకు ఓవల్‌లో ప్రసిద్ధ విజయం లభించింది. మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లు ఓడిపోయిన లంక మూడో టెస్ట్ మ్యాచ్ లో ఎనిమిది వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రీలంక ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయినప్పటికీ, 10 ఏళ్లుగా ఇంగ్లండ్‌ను వారి దేశంలో టెస్ట్ మ్యాచ్‌లో ఓడించని లోటును తీర్చుకుంది.
రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను కేవలం 156 పరుగులకే ఆలౌట్ చేయడం ద్వారా శ్రీలంక నాలుగో రోజు మ్యాచ్ లో ఫేవరెట్‌గా నిలిచింది. 219 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక పథుమ్ నిస్సాంక సూపర్ సెంచరీతో (127 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) విజయాన్ని అందించాడు. ఏంజెలో మాథ్యూస్‌తో (32 నాటౌట్; 3 ఫోర్లు), కుసాల్ మెండిస్ (39) నిస్సాంకకు మంచి తోడ్పాటును అందించడంతో లంక మంచి విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే కుప్పకూలింది.