ప్రేయ‌సితో నికోల‌స్ పూర‌న్ నిశ్చితార్థం

Nicholas Pooran Announces Engagement With Kathrina Miguel. వెస్టిండీస్ విధ్వంస‌క‌ర వీరుడు నికోల‌స్ పూర‌న్ త్వ‌ర‌లో ఓ

By Medi Samrat  Published on  17 Nov 2020 7:18 AM GMT
ప్రేయ‌సితో నికోల‌స్ పూర‌న్ నిశ్చితార్థం

వెస్టిండీస్ విధ్వంస‌క‌ర వీరుడు నికోల‌స్ పూర‌న్ త్వ‌ర‌లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రేయ‌సి మిగ్యూల్ తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా నికోల‌స్ సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకున్నాడు. ఆ భగవంతుడి ఆశీస్సులతో మిగ్యూల్‌తో నిశ్చితార్థం జరిగిందని.. ఆమెను పొంద‌డం ఎంతో అదృష్టం అంటూ రాసుకొచ్చాడు ఆ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌.

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2020 సీజ‌న్‌లో కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ త‌రుపున ఆడాడు పూర‌న్‌. ఆ జ‌ట్టు ప్లే ఆఫ్స్‌కు చేర‌న‌ప్ప‌టికి త‌న ఆట తీరుతో అంద‌రిని ఆకట్టుకున్నాడు. 14 మ్యాచుల్లో 353 ప‌రుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. గత కొంత కాలంగా పూరన్, మిగ్యూల్ ప్రేమ‌లో ముగినితేలుతున్నారు. వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలను ఇప్పటికే చాలా సార్లు సోషల్ మీడియా వేదికగా అభిమానుల‌తో పంచుకున్నారు. ఐపీఎల్ సందర్భంగా కూడా మిగ్యూల్ గ్యాల‌రీలో కూర్చొని పూరన్‌ను ప్రోత్స‌హించిన సంగ‌తి తెలిసిందే. ఇన్నాళ్లు ప్రేమ‌లో ఉన్న వీరిద్ద‌రు ఇక వివాహ బంధంతో ఒక్క‌టి కావాల‌ని అనుకుంటున్నారు.మోకాలిపై కూర్చుని మిగ్యూల్ చేతికి రింగ్ పెట్టిన ఫోటోను పూర‌న్ సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడు. 'ఆ భగవంతుడి ఆశీస్సులతో మిగ్యూల్‌తో నా నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని మీతో పంచుకుంటునందుకు సంతోషంగా ఉంది. లవ్ యూ మిగ్.. నిన్ను నేను పొందాను అంటూ రాసుకొచ్చాడు ఈ పంజాబ్ హిట్ట‌ర్‌. ఇక ఈ విష‌యం తెలిసిన అభిమానులు, క్రికెట‌ర్లు పూర‌న్‌కు విషెస్ చెబుతున్నారు. 'కంగ్రాట్స్ నిక్కీ' అని కుంబ్లే కామెంట్ చేయగా.. 'ప్రేమ స్వచ్చమైనది, ఇద్దరికి అభినందనలు' అంటూ హోల్డర్ రాసుకొచ్చాడు. ఇక పొలార్డ్ 'ది ప్రొఫెషనల్ కంగ్రాట్స్'అంటూ కామెంట్ చేశాడు.


Next Story
Share it