NZ Vs BAN: తుది జట్టు నుంచి తప్పుకున్న విలియమ్సన్
న్యూజిలాంట్ క్రికెట్ జట్టు స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధం అవుతోంది.
By Srikanth Gundamalla Published on 22 Dec 2023 11:54 AM ISTNZ Vs BAN: తుది జట్టు నుంచి తప్పుకున్న విలియమ్సన్
న్యూజిలాంట్ క్రికెట్ జట్టు స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే కివీస్ జట్టుకు షాక్ ఎదురైంది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్, స్టార్ పేసర్ కైల్ జేమీసన్ ఈ సిరీస్ నుంచి వైదొలిగారు. బంగ్లాదేశ్‌తో ఆడనున్న టీ20 సిరీస్‌కు ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం కావడంతో.. ఆ టీమ్ ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందుతున్నారు. అయితే.. వీరిద్దరు తుదిజట్టు నుంచి వైదొలిగిన విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ శుక్రవారం స్వయంగా వెల్లడించింది. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడే తుది జట్టులో ముందుగా విలియమ్సన్, జేమీసన్ ఇద్దరి పేర్లూ ఉన్నాయి. కానీ.. మోకాలి గాయం నుంచి విలియమ్సన్ పూర్తిగా కోలుకోలేదు. మరిన్ని రోజులు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించడంతో విలియమన్సన్ ఈ టీ20 సిరీస్ నుంచి తప్పకున్నాడు.
కేన్ మామతో పాటు.. జేమీసన్ కూడా మోకాలికి గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అతను కూడా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. దాంతో..ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లను జట్టు మేనేజ్‌మెంట్ దూరం చేయక తప్పలేదు. ఇక విలియమ్సన్ స్థానంలో యువ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రతో న్యూజిలాండ్ క్రికెట్ భర్తీ చేసింది. అదే విధంగా జేమీసన్ స్థానంలో మరో పేసర్ డఫీ జట్టులోకి వచ్చాడు. కేన్ మామ లేకపోవడంతో.. న్యూజిలాండ్ జట్టు పగ్గాలను మిచెల్ శాంట్నర్‌కు అప్పగించారు. డిసెంబర్ 27న నేపియర్ వేదికగా బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది.
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడే న్యూజిలాండ్ జట్టు ఇదే.. మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, జాకబ్ డఫీ, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోథి, టిమ్ సౌథి.