వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లోనే తొలిసారి.. 11 ఓవర్లు వేసిన‌ బౌల‌ర్‌..!

New Zealand Offspinner Eden Carson Bowls 11 Overs During an ODI. క్రికెట్‌లో మైదానంలో అంపైర్‌ది కీల‌క‌ పాత్ర. అంపైర్ నిర్ణయంతో చాలా మ్యాచ్‌ల ఫలితం కూడా తారుమారైంది.

By Medi Samrat  Published on  1 July 2023 12:02 PM GMT
వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లోనే తొలిసారి.. 11 ఓవర్లు వేసిన‌ బౌల‌ర్‌..!

క్రికెట్‌లో మైదానంలో అంపైర్‌ది కీల‌క‌ పాత్ర. అంపైర్ నిర్ణయంతో చాలా మ్యాచ్‌ల ఫలితం కూడా తారుమారైంది. అయితే శ్రీలంక, న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్ తప్పిదంతో ఓ అరుదైన‌ రికార్డు క్రియేట్ అయ్యింది. వన్డే క్రికెట్‌ చరిత్రలోనే ఇంత‌కు ముందు న‌మోద‌వ‌ని.. భ‌విష్య‌త్‌లో కూడా జ‌ర‌గ‌ద‌ని భావిస్తున్న‌.. అరుదైన రికార్డ్‌గా చెబుతున్న.. ఆ ఆశ్చ‌ర్య‌క‌ర ఘ‌ట‌న‌ను గురించి తెలుసుకుందాం.

న్యూజిలాండ్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో కివీస్ బౌలర్ ఈడెన్ కార్సన్ 11 ఓవర్ల స్పెల్ వేసింది. మ్యాచ్ 45వ ఓవర్ వేసిన వెంటనే కార్సన్ తన 10 ఓవర్ల స్పెల్ పూర్తి చేసింది. అయితే, అంపైర్ తప్పిదం కారణంగా.. న్యూజిలాండ్ బౌలర్ ఈడెన్ కార్సన్ ఇన్నింగ్స్‌ 47వ ఓవర్ వేయ‌డం ద్వారా 11 ఓవర్లు బౌల్ చేసింది. త‌ద్వారా వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి ఒక బౌలర్ 11 ఓవర్ల స్పెల్ బౌలింగ్ చేసిన అరుదైన రికార్డు న‌మోద‌య్యింది. ఈడెన్ కార్సన్ తన 11 ఓవర్ల స్పెల్‌లో 41 పరుగులు ఇచ్చి ఇద్దరు శ్రీలంక బ్యాట్స్‌వుమెన్‌ను పెవిలియన్‌కు పంపింది. కార్సన్ తన 11వ ఓవర్‌లో ఐదు బాల్ డాట్ బాల్స్ వేసి.. కేవలం ఒక ప‌రుగు మాత్ర‌మే ఇచ్చింది.

మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ 1-1తో సమం చేసింది. శ్రీలంకతో జరిగిన రెండో మ్యాచ్‌లో కివీస్‌ చెలరేగింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 329 పరుగుల భారీ చేసింది. సోఫియా డివైన్, అమిల్లా కెర్ లు సెంచరీలు చేశారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 229 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని న‌మోదుచేశారు. ఇది వన్డే క్రికెట్‌లో శ్రీలంకపై అతిపెద్ద భాగస్వామ్యం. అమిల్లా కెర్ 108 పరుగులు చేయగా.. డివైన్ 121 బంతుల్లో 137 పరుగులు చేసింది. 330 పరుగుల లక్ష్య ఛేదన‌కు దిగిన శ్రీలంక జట్టు 218 పరుగులకే ఆలౌటైంది.


Next Story