స్మిత్‌ను ఉద్దేశించి న్యూజిలాండ్ అభిమాని సెటైర్.. నెట్టింట్లో వైరల్
New zealand fan brutally trolls steve smith.క్రికెట్ ప్రపంచంలో కొన్ని జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లు ఎప్పటికి ఆసక్తికరంగా ఉంటాయి.
By తోట వంశీ కుమార్
ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సిరీస్ జరుగుతుండగా.. న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ తలపడుతోంది. భారత్‌తో వన్డే సిరీస్‌లో సెంచరీలతో కదం తొక్కిన ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్‌స్మిత్ టెస్టు సిరీస్‌లో దారుణంగా విఫలం అవుతున్నాడు. ముఖ్యంగా స్పిన్నర్ ఆశ్విన్ అంటేనే హడలిపోతున్నాడు. రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌లు ఆడిన స్మిత్.. 1,1*,8,0 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు సార్లు అశ్విన్ ఉచ్చుకు చిక్కడం గమనార్హం. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అర్థ సెంచరీ చేసిన బర్న్స్, రెండో టెస్టులో తేలిపోయాడు. కేవలం 0,4 పరుగులే చేశాడు. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న బర్న్స్ ఇప్పటికే ఆసీస్ చివరి రెండు టెస్టుల్లో పక్కన పెట్టిన విషయం తెలిసిందే.
New Zealand crowd trolling Joe Burns & Steve Smith. #NZvPAK #AUSvIND pic.twitter.com/093B6vWNS4
— Johns. (@CricCrazyJohns) January 4, 2021
అసలే ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్న ఈ ఇద్దరు ఆటగాళ్లకు చిరకాల ప్రత్యర్థి న్యూజిలాండ్ అభిమాని సెటైర్ పుండుమీద కారం చల్లినట్టుగా మారింది. న్యూజిలాండ్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ సందర్భంగా సదరు అభిమాని ప్లకార్డుతో వినూత్న రీతిలో విమర్శలు గుప్పించాడు. 'పెద్దగా ఉపయోగంలో లేని క్రికెట్ బ్యాట్లు అమ్మబడును. వివరాలకు స్మిత్, బర్న్స్‌ను సంప్రదించగలరు'అనే ప్లకార్డు ప్రదర్శించాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరిద్దరు ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతుంటే.. తండ్రైన ఉత్సాహంలో ఉన్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ వరుస సెంచరీలతో చెలరేగుతున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఫస్ట్ టెస్ట్‌లోనే సెంచరీతో రాణించిన కేన్(129).. తాజా రెండో టెస్ట్‌లోను మరో శతకం బాదాడు. విలియమ్సన్(112 బ్యాటింగ్) సెంచరీతో న్యూజిలాండ్ రెండో టెస్ట్‌లోనూ పట్టు బిగిస్తోంది.