4 ఓవర్లు, 3 వికెట్లు, ఒక్క పరుగు లేదు..ఫెర్గూసన్ ఆల్‌టైమ్ రికార్డు
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గూసన్ చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని రికార్డును క్రియేట్ చేశాడు.
By Srikanth Gundamalla Published on 18 Jun 2024 8:49 AM IST4 ఓవర్లు, 3 వికెట్లు, ఒక్క పరుగు లేదు..ఫెర్గూసన్ ఆల్‌టైమ్ రికార్డు
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గూసన్ చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని రికార్డును క్రియేట్ చేశాడు. వరుసగా నాలుగు ఓవర్లు మెయిడిన్ చేసిన బౌలర్‌గా చరిత్రకెక్కడు. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా న్యూజిలాండ్ టీమ్ పపువా న్యూగినియాతో సోమవారం మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లోనే ఫెర్గూసన్ అరుదైన ఘనతను సాధించాడు. నాలుగు ఓవర్లలో ఒక్క పరుగు ఇవ్వకుండా 3 వికెట్లు తీసాడు. టీ20 ప్రపంచకప్‌తో పాటు పొట్టి క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఎకానమీ నమోదు చేసిన ఆటగాడిగా అరుదైన ఫీట్ సాధించాడు.
పపువా న్యూగినియాతో ఇన్నింగ్స్ సందర్భంగా ఐదో ఓవర్‌లో బంతిని తీసుకున్నాడు కివీస్ పేసర్ ఫెర్గూసన్. తొలి బంతికే వికెట్‌ను అందుకున్నారు. ఆ తర్వాత ఐదు బంతులను మెయిడిన్‌గా వేశాడు. మళ్లీ ఏడో ఓవర్‌లో బంతిని తీసుకున్న ఫెర్గూసన్.. మరోసారి మెయిడిన్ చేశాడు. 12 ఓవర్‌లో రెండో బంతికి వికెట్ తీశాడు. అలా తాను వేసిన మూడో ఓవర్‌ను కూడా మెయిడిన్ చేశారు. ఆ వెంటనే 14 ఓవర్‌ను కూడా ఫెర్గూసన్ తీసుకున్నారు. ఆ ఓవర్లో రెండో బంతికే మూడో వికెట్‌ను పడగొట్టాడు. మళ్లీ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఇలా నాలుగు ఓవర్లు వేసి మూడు వికెట్లను తీసుకోవడమే కాదు.. ఒక్కపరుగు కూడా ఇవ్వకుండా మెయిడిన్ చేసి రికార్డును క్రియెట్ చేశాడు. 2021లో కెనడా బౌర్ సాద్ బిన్ పనామాతో జరిగిన మ్యాచ్‌లో వరసగా నాలుగు ఓవర్లు మెయిడిన్ చేసినా 2 వికెట్లను తీసుకున్నాడు. తాజాగా ఫెర్గూసన్ 4 ఓవర్లను మెయిడిన్ చేయడంతో పాటు 3 వికెట్లు తీసుకుని రికార్డును బ్రేక్ చేశాడు.
ఫెర్గూసన్ దాటికి 19.4 ఓవర్లలో ఆలౌట్ అయిన పపువా న్యూగినియా 78 పరుగులే చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన న్యూజిలాండ్ 12.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది.