ఐపీఎల్-2021 కొత్త రూల్స్ వచ్చేశాయి..!

New Rules For IPL 2021.ఐపీఎల్-2021 విషయంలో కొత్త రూల్స్ రాబోతున్నాయి.

By Medi Samrat  Published on  30 March 2021 7:28 AM GMT
IPL 2021 rules

ఐపీఎల్-2021 కు కౌంట్ డౌన్ మొదలవ్వడంతో క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. మ్యాచ్ లు మొత్తం బయోబబుల్ లో జరగనున్నాయి. ఇక ఐపీఎల్-2021 విషయంలో కొత్త రూల్స్ రాబోతున్నాయి. అలాగని ఏ బిగ్ బ్యాష్ లీగ్ లో ఉండే రూల్స్ అని అనుకోకండి. సాఫ్ట్ సిగ్న‌ల్‌, ఇన్నింగ్స్ ముగియాల్సిన స‌మ‌యంపై బీసీసీఐ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ఈ సీజ‌న్ నుంచి ఈ కొత్త రూల్స్ వ‌ర్తిస్తాయ‌ని స్పష్టం చేసింది.

ఆన్‌ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్న‌ల్ ఐపీఎల్‌లో ఉండ‌ద‌ని బోర్డు తెలిపింది. థ‌ర్డ్ అంపైర్‌కు నివేదించే ముందు ఆన్‌ఫీల్డ్ అంపైర్ త‌న నిర్ణ‌యంగా సాఫ్ట్ సిగ్న‌ల్ ఇస్తారు. దీని ప్ర‌భావం మూడో అంపైర్ నిర్ణ‌యంపై కూడా ఉంటుంది. భారత్- ఇంగ్లండ్ సిరీస్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ అవుట్ అయినట్లు చెప్పిన సాఫ్ట్ సిగ్న‌ల్‌పై కెప్టెన్ విరాట్ కోహ్లి అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. ఆన్‌ఫీల్డ్ అంపైర్ ఏదైనా సాఫ్ట్ సిగ్న‌ల్ ఇచ్చినా కూడా అది థ‌ర్డ్ అంపైర్ నిర్ణ‌యంపై ఎలాంటి ప్ర‌భావం చూప‌బోద‌ని కూడా స్ప‌ష్టం చేసింది. ఇక ఎల్బీడ‌బ్ల్యూ నిర్ణ‌యాల్లో అంపైర్స్ కాల్‌పై కూడా కోహ్లి అసంతృప్తి వ్య‌క్తం చేసినా.. ఈ విష‌యంలో బీసీసీఐ ఎలాంటి మార్పులు చేయ‌లేదు.


ఈ సీజ‌న్‌లో 90 నిమిషాల్లోనే ఇన్నింగ్స్‌ 20వ ఓవ‌ర్ పూర్తి కావాలి. గ‌తంలో 90వ నిమిషం లేదా ఆలోపు 20వ ఓవ‌ర్ ప్రారంభించే వీలు ఉండేది. కానీ మ్యాచ్ స‌మ‌యం మ‌రీ ఎక్కువ కాకుండా ఉండ‌టానికి బోర్డు ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఒక ఇన్నింగ్స్ క‌చ్చితంగా 90 నిమిషాల్లోనే (85 నిమిషాల ఆట + 5 నిమిషాల స్ట్రేట‌జిక్ టైమౌట్‌) ముగియాలి. ఆ లెక్క‌న గంట‌కు 14.11 ఓవ‌ర్లు వేయాల‌ని కూడా బీసీసీఐ స్ప‌ష్టం చేసింది. బ్యాట్స్‌మ‌న్ ప‌రుగు తీసే క్ర‌మంలో బ్యాట్‌ను క్రీజులో స‌రిగా ఉంచ‌క‌పోతే షార్ట్ ర‌న్‌గా అంపైర్లు ప్ర‌క‌టిస్తారు. గ‌తేడాది పంజాబ్ కింగ్స్ ఆడిన మ్యాచ్‌లో అంపైర్ పొర‌పాటుగా ప్ర‌క‌టించిన షార్ట్ ర‌న్ ఆ టీమ్ ప్లే ఆఫ్ ఆశలపై నీళ్లు జల్లిన సంగతి తెలిసిందే. ఏడాది నుంచి ఈ నిర్ణ‌యాన్ని థ‌ర్డ్ అంపైర్ నిర్ణయించనున్నారు.


Next Story