అత్యంత చెత్త రికార్డు.. 8 ప‌రుగుల‌కే ఆలౌట్‌

Nepal All out for just 8 runs against UAE in U19 Women's World Cup qualifier.క్రికెట్‌లో రికార్డుల‌కు కొద‌వ లేదు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jun 2022 9:33 AM GMT
అత్యంత చెత్త రికార్డు.. 8 ప‌రుగుల‌కే ఆలౌట్‌

క్రికెట్‌లో రికార్డుల‌కు కొద‌వ లేదు. ఎలా ఆడినా స‌రే ఏదో ఒక రికార్డు న‌మోదు అవుతూనే ఉంటుంది. అయితే.. ఎవ్వరు కోరుకోని రికార్డు ఇది. క్రికెట్ చ‌రిత్ర‌లోనే అత్యంత చెత్త రికార్డును నేపాల్ అండ‌ర్‌-19 మ‌హిళ‌ల జ‌ట్టు త‌మ ఖాతాలో వేసుకుంది. అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ క్వాలిఫ‌య‌ర్ మ్యాచ్‌లో నేపాల్ జ‌ట్టు యునైటెడ్ అర‌బ్ జ‌ట్టుతో త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ ప‌ట్టుమ‌ని 10 ప‌రుగులు కూడా చేయ‌లేదు. జ‌ట్టు మొత్తం క‌లిపి 8 ప‌రుగులు చేసి ఆలౌటైంది.

తద్వారా క్రికెట్‌ చరిత్రలో అత్యల్ప స్కోర్‌కే ఆలౌటైన జట్టుగా నేపాల్ నిలిచింది. స్నేహ మహారా 3 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆరుగురు ప్లేయర్లు క‌నీసం ఖాతా కూడా తెర‌వ‌లేదు. యూఏఈ ఆఫ్ స్పిన్న‌ర్ మ‌హిక‌ గౌర్ నాలుగు ఓవర్లలో 2 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టగా.. ఇందుజ మూడు వికెట్లు తీసింది. అనంత‌రం స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని యూఏఈ ఏడు బంతుల్లోనే చేదించింది. దీంతో ఈ మ్యాచ్ 9.2 ఓవ‌ర్ల‌లోనే ముగిసింది.

కాగా.. అంత‌క‌ముందు నేపాల్ ఆడిన మ్యాచ్‌లో ఖ‌తార్‌ను 38 ప‌రుగుల‌కే ఆలౌట్ చేయ‌డం గ‌మ‌నార్హం. 2023లో దక్షిణాఫ్రికా వేదికగా జరుగనున్న ప్ర‌పంచ‌క‌ప్ కోసం నేపాల్‌, థాయ్‌లాండ్‌, భూటాన్‌, యూఏఈ, ఖతార్‌ మధ్య క్వాలిఫయింగ్‌ పోటీలు జరుగుతున్నాయి.

Next Story