జావెలిన్ త్రో.. ఫైనల్‌కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా
Neeraj Chopra Qualifies for mens Javelin throw final.పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్-ఏలో భారత్‌కు
By తోట వంశీ కుమార్ Published on 4 Aug 2021 2:36 AM GMTపురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్-ఏలో భారత్‌కు చెందిన నీరజ్ చోప్రా సంచలనం సృష్టించాడు. తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఈ యువ క్రీడాకారుడు పైనల్‌కు అర్హత సాధించాడు. గ్రూప్ ఏ క్వాలిఫికేషన్ రౌండ్ తొలి ప్రయత్నంలోనే 86.55 మీటర్ల దూసం విసిరి నేరుగా ఫైనల్‌కు చేరుకున్నాడు. ఈ సీజన్‌లో నీరజ్ అత్యుత్రమ త్రో ఇదే కావడం విశేషం. ఇదే గ్రూప్‌లో ఫిన్లాండ్‌కు చెందిన లస్సీ ఎటలాట 84.50 మీటర్ల త్రోతో నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. ఆ తర్వాత రొమేనియాకు చెందిన అలెగ్రాండ్రూ మిహైతో నోవాక్ 83.27 మీటర్లు విరిసి మూడుస్థానంలో నిలిచాడు. జావెలిన్ త్రో ఫైనల్ ఈ నెల 7న జరుగుతుంది.
.@Neeraj_chopra1 made entering an Olympic final look so easy! 😲😱
— #Tokyo2020 for India (@Tokyo2020hi) August 4, 2021
Neeraj's FIRST attempt of 86.65m in his FIRST-EVER #Olympics was recorded as the highest in men's Group A, beating @jojo_javelin's 85.64m 👏#StrongerTogether | #UnitedByEmotion | #Tokyo2020 | #BestOfTokyo pic.twitter.com/U4eYHBVrjG
ఒలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్
- ఉ.8 గంటలకు మహిళల 400 మీ. హార్డిల్స్ ఫైనల్
- ఉ.8 గం.ల నుంచి రెజ్లింగ్ పురుషుల 57 కిలోల విభాగం (రవికుమార్)
- ఉ.8 గం.ల నుంచి రెజ్లింగ్ మహిళల 57 కిలోల విభాగం (అన్షుమాలిక్)
- ఉ.8 గం.ల నుంచి రెజ్లింగ్ పురుషుల 86 కిలోల విభాగం (దీపక్ పునియా)
- ఉ.11 గంటలకు బాక్సింగ్ మహిళల 69 కిలోల విభాగం సెమీస్ (లవ్లీనా)
- మధ్యాహ్నం 2:45 గంటల నుంచి రెజ్లింగ్ సెమీఫైనల్
- మధ్యాహ్నం 3:30 నుంచి హాకీ మహిళల సెమీస్ (భారత్-అర్జెంటీనా)
- సాయంత్రం 5:35 నుంచి పురుషుల 800 మీ. హార్డిల్స్ ఫైనల్
- సాయంత్రం 6:25 నుంచి పురుషుల 200 మీ. హార్డిల్స్ ఫైనల్