కొత్త జట్లకు పేర్లు పెట్టిన ముంబై ఇండియన్స్
Mumbai Indians Owners Reveal Names of New Franchises.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్లలో
By తోట వంశీ కుమార్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. ఈ టోర్నీలో మరే జట్టుకు సాధ్యం కాని విధంగా ఇప్పటి వరకు ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలో నడుస్తున్న ముంబై ఇండియన్స్ తాజాగా మరో రెండు దేశాల్లో జరుగుతున్న ప్రైవేటు లీగ్స్‌లోనూ అడుగుపెడుతోంది.
🚨 Welcoming @MIEmirates & @MICapeTown into our FA𝐌𝐈LY OF TEAMS! 💙
— Mumbai Indians (@mipaltan) August 10, 2022
📰 Read more - https://t.co/85uWk804hU#OneFamily #MIemirates #MIcapetown @EmiratesCricket @OfficialCSA
వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానున్న యూఏఈ టి20 లీగ్‌లో ఒక జట్టును, క్రికెట్ సౌతాఫ్రికా నిర్వహించనున్న సీఎస్‌కే టి20 లీగ్‌లో మరొక జట్టును కొనుగోలు చేసింది. ఆ రెండు జట్లకు సంబంధించిన పేర్లను రివీల్ చేసింది. ముంబై ఇండియన్స్(ఎంఐ) బ్రాండ్ కొనసాగేలా ఆయా జట్లకు నామకరణం చేసింది.
🇦🇪🤝🇮🇳🤝🇿🇦
— Mumbai Indians (@mipaltan) August 10, 2022
Presenting @MICapeTown & @MIEmirates 🤩💙#OneFamily #MIemirates #MIcapetown @EmiratesCricket @OfficialCSA pic.twitter.com/6cpfpyHP2H
యూఏఈ లో కొనుగోలు చేసిన ఫ్రాంచైజీకి ముంబై ఎమిరేట్స్(MI Emirates), సౌతాఫ్రికా టి20 లీగ్‌లో జట్టుకు ముంబై కేప్‌టౌన్ (MI Cape Town) అనే పేర్లను పెట్టింది. దేశ విదేశాల్లో ఎంఐ బ్రాండ్ మరింత పెంచేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్రాంచైజీల పేర్లతో పాటు అందులో పాల్గొననున్న ఆటగాళ్లు కూడా ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ధరించిన జెర్సీనే ధరించనున్నారు. లోగో మారనుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ముంబై ఇండియన్స్ తెలియజేసింది.
🆕 𝕋𝔼𝔸𝕄
— Mumbai Indians (@mipaltan) August 10, 2022
💙 𝕊𝔸𝕄𝔼 FA𝐌𝐈LY
🇦🇪 @MIEmirates
🎨: James Sun#OneFamily #MIemirates @EmiratesCricket pic.twitter.com/bxFM9EzBW7