ప్రత్యేక విమానాల్లో ఆటగాళ్లను వారు కోరుకున్న చోటుకు చేర్చిన ముంబై ఇండియన్స్
Mumbai Indians Overseas Players Reach Their Destinations.ఐపీఎల్ కరోనా కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే..! వాయిదా పడడం
By తోట వంశీ కుమార్ Published on 9 May 2021 7:08 PM ISTఐపీఎల్ కరోనా కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే..! వాయిదా పడడం పక్కన పెడితే కొన్ని దేశాల్లో ఉన్న నిబంధనల కారణంగా వారు సొంత ఊళ్లకు చేరుకుంటారా లేదా అనే డౌట్ వాళ్ళను తెగ ఇబ్బంది పెట్టింది. ఆటగాళ్లను సొంత ఊళ్లకు/దేశాలకు చేర్చడానికి ఆయా ఫ్రాంచైజీలు చర్యలు తీసుకున్నాయి. కొన్ని దేశాలకు చెందిన ఆటగాళ్ల కోసం చార్టర్డ్ విమానాలను ఉపయోగించారు. ఆసీస్ ఆటగాళ్లు ఇంకా వెళ్ళడానికి అవకాశాలు లేకపోవడంతో వారందరూ మాల్దీవుల్లో ఉన్నారు. తాజాగా ముంబై ఇండియన్స్ జట్టు తమ జట్టులోని విదేశీ ఆటగాళ్లను, కోచింగ్ స్టాఫ్ ను వారు కోరుకున్న ప్రదేశాలకు చేర్చింది.
ముంబై ఇండియన్స్ జట్టు విదేశీ ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేసింది. వారి సొంత దేశాలకు పంపించింది. అందరూ ఆయా దేశాలకు జాగ్రత్తగా చేరిపోయారని కొత్త అప్డేట్ ను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. న్యూజిలాండ్ కు చెందిన ట్రెంట్ బౌల్ట్, జిమ్మీ నీషమ్ లతో పాటుగా.. సపోర్ట్ స్టాఫ్ ను ఆక్లాండ్ లో చేర్చారు. ముంబై ఇండియన్స్ కోచ్ మహేళ జయవర్దనేతో పాటూ.. ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాళ్లు మాల్దీవులకు చేరుకున్నారు. వారు తమ సొంత దేశాలకు వెళ్లే ముందు మాల్దీవుల్లో 14 రోజుల పాటూ క్వారెంటైన్ లో ఉండనున్నారు. ఓపెనర్ డికాక్, ఫాస్ట్ బౌలర్ మాక్రో జెన్సన్ దక్షిణాఫ్రికా రాజధాని జొహన్నెస్ బర్గ్ కు చేరుకోగా.. ఆల్ రౌండర్ కీరన్ పోలార్డ్ ట్రినిడాడ్ కు చేరుకున్నాడు.
"All foreign members of the MI contingent have reached their destinations safe & sound. Paltan, make sure you follow all safety protocols. Stay at home. Stay safe," అంటూ ముంబై ఇండియన్స్ బృందం సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
🛫🅃🄾🅄🄲🄷🄳🄾🅆🄽🛬
— Mumbai Indians (@mipaltan) May 9, 2021
All foreign members of the MI contingent have reached their destinations safe & sound.
Paltan, make sure you follow all safety protocols. Stay at home. Stay safe. 😷🧴💙#OneFamily #MumbaiIndians pic.twitter.com/1JwWGZkwpp
విదేశీ ఆటగాళ్లను, బృందంలోని సభ్యులను వారి గమ్యస్థానాలలోకి చేర్చామని తెలిపింది. అభిమానులు కూడా జాగ్రత్తగా కోవిడ్ ప్రోటోకాల్స్ ను పాటించాలని కోరారు. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు 7 మ్యాచ్ లలో నాలుగు మ్యాచ్ లు గెలిచిన సమయంలో ఐపీఎల్ ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.