బుమ్రా బ్యాక్.. టాస్ గెలిచిన హార్దిక్
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI) జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది.
By Medi Samrat
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI) జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. దాదాపు మూడు నెలల తర్వాత ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. మోకాలి గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన రోహిత్ శర్మ కూడా బరిలోకి దిగనున్నాడు. రజత్ పాటిదార్ నేతృత్వంలోని RCB, సీజన్‌లో తొలి ఓటమి తర్వాత తిరిగి విజయాల బాట పట్టాలని చూస్తోంది. విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వస్తాడని RCB ఆశిస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచులు ఆడిన ముంబై ఒకటి మాత్రమే గెలిచింది. మూడు మ్యాచులు ఆడిన బెంగళూరు ఒక మ్యాచ్ ఓడి.. రెండు మ్యాచుల్లో గెలిచింది. ఇవాళ్టి మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని రెండు జట్లూ చూస్తున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నట్లు తెలిపాడు.
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్(w), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, విఘ్నేష్ పుత్తూర్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(సి), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్