విరాట్, రోహిత్ టీ20లకు అందుకే దూరంగా ఉన్నారు: మాజీ చీఫ్ సెలక్టర్
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీమిండియాలో స్టార్ ప్లేయర్లు.
By Srikanth Gundamalla Published on 11 Jan 2024 5:39 PM ISTవిరాట్, రోహిత్ టీ20లకు అందుకే దూరంగా ఉన్నారు: మాజీ చీఫ్ సెలక్టర్
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీమిండియాలో స్టార్ ప్లేయర్లు. వీరు ఆడుతున్నారంటే అభిమానులకు పండగే. అయితే.. టీ20 క్రికెట్‌లో గత కొన్నాళ్లుగా వీరిద్దరూ ఆడటం లేదు. గత టీ20 వరల్డ్ కప్ -2022 తర్వాత ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో ఇద్దరూ కనబడలేదు. పొట్టి క్రికెట్‌లో భాగంగా ఐపీఎల్ మినహా ఈ మ్యూచ్‌లూ విరాట్, రోహిత్ ఆడలేదు. దాంతో.. వీరిద్దరూ ఎందుకు పొట్టి క్రికెట్ ఆడటం లేదనే ప్రశ్న అందర్లోనూ ఉంది. ఇదే విషయంపై తాజాగా భారత మాజీ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కకే ప్రసాద్ మాట్లాడారు. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
గత టీ20 వరల్డ్ కప్ తర్వాత ఈ ఫార్మాట్‌లో విరాట్, రోహిత్ ఆడకపోవడంతో అభిమానుల్లో నిరాశ కొనసాగింది. ఇలా ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నలు వచ్చాయి. అయితే.. దీనిపైన మాట్లాడిన ఎంఎస్కే.. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్ కోసమే టీ20 మ్యాచ్‌ల నుంచి విరాట్, రోహిత్ విరామం తీసుకున్నారని చెప్పారు. కేవలం వన్డేల మీద దృష్టి పెట్టడం అప్పుడు కీలకం అనిపించిందని చెప్పారు. ఆ సమయంలో యువ క్రికెటర్లకు కూడా అవకాశం కల్పించినట్లు అయ్యిందన్నారు ఎంఎస్కే. సెలక్టెర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ సరైన నిర్ణయం తీసుకుని విరాట్, రోహిత్‌ను టీ20లకు ఎంపిక చేయలేదని చెప్పారు. ఇక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ కూడా గతేడాదే జరిగింది గుర్తు చేశారు. టెస్టు క్రికెట్‌పైనా రోహిత్, విరాట్ ఫోకస్ చేశారని వెల్లడించారు.
ఇక ఇప్పుడు టీ20 మోడ్‌లోకి మారాల్సిన సమయం వచ్చిందన్నారు మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే. ఈ క్రమంలోనే టీ20 జట్టులోకి విరాట్, రోహిత్‌ను తీసుకున్నట్లు చెప్పారు. టీ20 వరల్డ్ కప్ త్వరలోనే జరగనున్న నేపథ్యంలో తుది జట్టులో వీరిద్దరూ ఉంటారనీ.. ఇంకా షమీ, సిరాజ్, బుమ్రా, జడేజా, హార్దిక్ ఉంటారని స్పష్టం చేశారు. వికెట్ కీపర్ విషయంలోనే సంక్లిష్టంగా ఉందని చె్పారు. కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, రిషబ్, ఇషాన్ కిషన్ సిద్ధమైతే ఎవరిని తీసుకోవాలనే విషయం కీలకం అవుతుందన్నారు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌లో ఒకరిని ఫామ్‌ను బట్టి తుది జట్టులోకి వస్తారని ఎంఎస్కే ప్రసాద్ వెల్లడించారు.
తాజాగా టీమిండియా అప్ఘానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్ ఆడబోతుంది. ఐపీఎల్‌కు ముందు టీమిండియా ఆడే చివరి అంతర్జాతీయ పొట్టి సిరీస్ ఇదే. అప్ఘానిస్తాన్ చిన్న టీమ్ కదా అని తక్కువ అంచనా వేయొద్దు. రషీద్‌ఖాన్ ఇప్పుడు ఆ జట్టులో లేకపోయినా ప్రమాకరంగా ఉన్న టీమే వారిదని ఎంఎస్కే ప్రసాద్ అన్నారు. విరాట్, రోహిత్ ఉన్న సందర్భంగా టీమ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా చెప్పారు.