మైథలాజికల్ సూపర్ హీరోగా ధోనీ.. క‌త్తి ప‌ట్టుకుని రాక్ష‌సులను సంహ‌రిస్తూ

MS Dhoni's First Look as Atharva in Sci-Fi Series Unveiled.టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌, మిస్ట‌ర్ కూల్ మ‌హేంద్ర సింగ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Feb 2022 5:09 AM GMT
మైథలాజికల్ సూపర్ హీరోగా ధోనీ.. క‌త్తి ప‌ట్టుకుని రాక్ష‌సులను సంహ‌రిస్తూ

టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌, మిస్ట‌ర్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోని ఇన్నాళ్లు ఆట‌గాడిగా, మెంటార్‌గా అభిమానుల‌ను అల‌రించగా.. తాజాగా ధోని మైథలాజికల్ సూపర్ హీరో అవతారమెత్తాడు. సైన్స్ ఫిక్షన్ గ్రాఫిక్ నవల 'అథర్వ-ది ఆరిజిన్‌'లో అథర్వగా కనిపించబోతున్నాడు. గ్రాఫిక్స్ రూపంలో దీన్నితెర‌కెక్కిస్తున్నారు. ఇందులో మ‌హేంద్రుడు ఓ యోధుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఇందుకు సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఇందులో ధోని రెండు చేతుల్లో రెండు క‌త్తులు ప‌ట్టుకుని రాక్ష‌సుల గుంపును సంహ‌రిస్తున్న‌ట్లుగా క‌నిపిస్తున్నాడు. ఇప్పటి దాకా క్రికెటర్ గా మాత్రమే జనానికి అలవాటైన ధోనిని ఇప్పుడు కత్తి పట్టుకుని తలలు నరుకుతుంటే చూడటం మాత్రం కొంచెం కొత్తగానే ఉంది. కాగా.. ధోని ఇందుకు సంబంధించిన ఫ‌స్టు లుక్‌ను సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకుని త‌న ఆనందాన్ని తెలియ‌జేశాడు. దీని గురించి ధోని మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌తో భాగ‌మైనందుకు థ్రిల్ అవుతున్న‌ట్లు చెప్పాడు. ఇది నిజంగా అద్భుతమైన వెంచర్. 'అథర్వ – ది ఆరిజిన్' అనేది ఆకర్షణీయమైన కథ, ఆకర్షణీయమైన గ్రాఫిక్ నవల ధోని చెప్పుకొచ్చాడు.

ర‌మేశ్ త‌మిళ్ మ‌ని అనే ర‌చ‌యిత ఈ క‌థ‌ని సిద్దం చేస్తుండ‌గా.. ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థ స‌హ‌కారం అందిస్తుండ‌టం విశేషం. ఈ గ్రాఫిక్ నవల త్వరలో అమెజాన్‌లో అందుబాటులోకి రానుంది. ప్రీ-ఆర్డర్ల ద్వారా దీన్ని కొనుగోలు చేసే అవకాశం ఉందని వీడియో చివర్లో ప్రకటించారు.

Next Story
Share it