ధోనీ పాదాలను తాకిన అమ్మాయి.. ఎలా స్పందించాడంటే..

ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ అతడి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు.

By Medi Samrat  Published on  27 Aug 2023 4:53 PM IST
ధోనీ పాదాలను తాకిన అమ్మాయి.. ఎలా స్పందించాడంటే..

ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ అతడి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. మహీని క‌లిసేందుకు.. చూసేందుకు అభిమానులు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. అయితే.. త‌మ అభిమాన ఆట‌గాడిని కలిసే అవకాశం వస్తే మాత్రం అభిమానులు ఆ క్షణాన్ని గుర్తుండిపోయేలా చేయడానికి ప్రయత్నిస్తారు. మహిని కలవాలనుకున్న అలాంటి ఓ అభిమాని కోరిక ఇటీవల నెరవేరింది. దీంతో వెంటనే ధోనీ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుంది. దీనిపై ధోనీ స్పందించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ ఒక వీడియోలో MS ధోనీ కుర్చీపై కూర్చుని ఎవరితోనో మాట్లాడుతున్నట్లు కనిపించాడు. ఇంతలో ఒక అమ్మాయి ధోనీని కలవడానికి అక్కడికి వ‌చ్చి పాదాలను తాకింది. అమ్మాయి తన పాదాలను తాకినప్పుడు ధోనీ ఆశ్చర్యం వ్య‌క్తం చేస్తాడు. వెంటనే ఆమె వైపు తన చేతిని చాచాడు. మహితో అమ్మాయి కరచాలనం చేసిన తర్వాత.. ఆమెతో కలిసి ఫోటో దిగాడు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. వీడియో ప‌ట్ల నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. త‌మ‌కు ఇలాంటి ఒక రోజు రావాల‌ని కోరుకుంటున్నామ‌ని కామెంట్ చేస్తున్నారు.

Next Story