నా లాస్ట్ సీజన్ అని మీరే డిసైడ్ అయ్యారు.. నేను కాదు : ధోనీ

MS Dhoni's epic response on IPL retirement. మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్ అంటూ ప్రచారం సాగుతూనే ఉంది.

By Medi Samrat  Published on  3 May 2023 5:50 PM IST
నా లాస్ట్ సీజన్ అని మీరే డిసైడ్ అయ్యారు.. నేను కాదు : ధోనీ

మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్ అంటూ ప్రచారం సాగుతూనే ఉంది. ఈ విషయంపై మహేంద్రుడు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ ఆరంభానికి ముందు టాస్ సమయంలో ధోనీకి రిటైర్మెంట్ గురించి ప్రశ్న ఎదురైంది. ‘ఇది మీ లాస్ట్ సీజన్, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?’ అంటూ ప్రశ్నించాడు డానీ మోరిసన్. అందుకు ధోనీ నుండి ఊహించని సమాధానం ఎదురైంది. ‘నా లాస్ట్ సీజన్ అని మీరే డిసైడ్ అయ్యారు. నేను కాదు...’ అంటూ నవ్వేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. వచ్చే ఏడాది కూడా ధోని ఆడబోతున్నాడంటూ అనౌన్స్ చేసేశాడు డానీ మోరిసన్.

లక్నో సూపర్ జెయింట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగిస్తూనే ఉంది. ధోని ఐపీఎల్ ప్రారంభం నుంచి అంటే 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు.ఈ సీజన్ తో ధోని రిటైర్మెంట్ కాబోతున్నాడంటూ ప్రచారం సాగుతూనే ఉంది.


Next Story