దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఒక బ్రాండ్ ను సెట్ చేశాడు. అలాంటి డైరెక్టర్ క్రికెట్ ఐకాన్ మహేంద్ర సింగ్ ధోనితో కలిసి ఒక అడ్వార్టైజ్మెంట్ చేశాడు. ఆ యాడ్ లో ధోనిని అనిమల్ లుక్ లో చూడొచ్చు. ఎలక్రిక్ సైకిల్ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నవ్వులు పూయిస్తూ ఉంది.
రణబీర్ కపూర్‌ను అనుకరిస్తూ ఎంఎస్ ధోని 'అనిమల్' క్యారెక్టర్ చేశాడు. ఎలక్ట్రిక్ సైకిల్ కంపెనీ అయిన ఈమోటోరాడ్ కోసం చేసిన ప్రకటనలో రణ్‌విజయ్ సింగ్ పాత్రను ధోని పోషించాడు. అనిమల్ సినిమా రణబీర్ తన కారు నుండి దిగి తన గ్యాంగ్‌తో కలిసి రోడ్డు దాటుతున్నట్లు చూపించిన సన్నివేశాన్ని ధోని రీక్రియెట్ చేశాడు. వంగా, ధోని మధ్య సంభాషణ నవ్వులు పూయించింది. మాజీ భారత కెప్టెన్ నటన కూడా చాలా బాగుంది.
ధోని ఐపీఎల్‌లో తన 18వ సీజన్ ఆడడానికి సిద్ధమవుతున్నాడు. CSK లెజెండ్ తన శిక్షణను బృందంలోని ఇతరుల కంటే ముందే ప్రారంభించాడు. ఇటీవల రిషబ్ పంత్ సోదరి వివాహ వేడుకలకు కూడా హాజరయ్యాడు. మార్చి 23న చెన్నైలో జరిగే మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.