ధ‌ర త‌గ్గినా ధోనీనే టాప్‌..!

ఐపీఎల్‌లో అత్యంత స‌క్సెస్‌పుల్‌ జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి కావడానికి ధోనీ కారణం.

By Kalasani Durgapraveen  Published on  10 Dec 2024 7:07 AM GMT
ధ‌ర త‌గ్గినా ధోనీనే టాప్‌..!

ఐపీఎల్‌లో అత్యంత స‌క్సెస్‌పుల్‌ జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి కావడానికి ధోనీ కారణం. ధోనీకున్న ఇమేజ్‌ దృష్ట్యా చాలా బ్రాండ్‌లు ఆయ‌న ద్వారా ప్ర‌మోష‌న్స్ చేయిస్తాయి. ఈ క్ర‌మంలో ధోనీ 2024 సంవత్సరం ప్రథమార్థంలో మార్కెట్ విలువ పరంగా అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్‌లను అధిగమించాడు. ధోనీ ఇటీవల యూరోగ్రిప్ టైర్స్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ధోనీ గల్ఫ్ ఆయిల్, క్లియర్‌ట్రిప్, మాస్టర్ కార్డ్, సిట్రాన్, లెస్ వంటి బ్రాండ్‌లలో కూడా కనిపిస్తాడు.

నివేదిక ప్రకారం.. ధోనీ 2024 ప్రథమార్థంలో 42 బ్రాండ్‌లతో ఒప్పందాలు చేసుకున్నాడు. ఇది అభితాబ్ బచ్చన్ ఒక శాతం, షారుక్ ఖాన్ కంటే 8 శాతం ఎక్కువ కాడం విశేషం. అయితే.. వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్‌లో ధోనీ ఆడతాడా లేదా అన్న చర్చ కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ అతనిని IPL-2025 కోసం ఉంచుకుంది. అయితే.. ధోని ధర చాలా తగ్గింది. రూ.12 కోట్లు ఉండే ఆయన ధ‌ర‌ ఈసారి రూ.4 కోట్లు మాత్రమే ప‌లికింది. ధోనీని సీఎస్‌కే అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఉంచుకుంది.

ధోనీ కెప్టెన్సీలో ఐదుసార్లు చెన్నైకి ఐపీఎల్ టైటిల్‌ను అందించాడు. గతేడాది కెప్టెన్సీ నుంచి తప్పుకుని రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా చేశాడు. అయితే.. చెన్నై ప్లేఆఫ్‌కు వెళ్లే అవకాశాన్ని కోల్పోయింది. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని ప్రతి సంవత్సరం చెబుతుంటారు. ధోని 2020 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం IPL రిటైర్మెంట్ గురించి వార్త‌లు వస్తూనే ఉన్నాయి.

Next Story