ధోని ఎక్కడ తేలాడో తెలుసా?

US ఓపెన్ 2023 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఒక దృశ్యం కనిపించింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Sept 2023 7:15 PM IST
ms dhoni, spotted, US open 2023 tennis,

ధోని ఎక్కడ తేలాడో తెలుసా?

US ఓపెన్ 2023 మొదలైంది. నొవాక్ జొకోవిచ్, డానియల్ మెద్వెదేవ్, కార్లోస్ అల్కరాజ్ మరెందరో ఆటగాళ్లు టైటిల్ ను కైవసం చేసుకోడానికి పోటీ పడుతున్నారు. అయితే యూఎస్ ఓపెన్ చూస్తున్న ఇండియన్స్ కు ఆడియన్స్ లో ఉన్న వ్యక్తి తమకు బాగా తెలిసిన వ్యక్తే అనే ఫీలింగ్ కలిగింది. కార్లోస్ అల్కరాజ్ vs అలెగ్జాండర్ జ్వెరెవ్ US ఓపెన్ 2023 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఒక దృశ్యం కనిపించింది. అక్కడ ఎంజాయ్ చేస్తున్న వ్యక్తి మరెవరో కాదు.. భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని.

న్యూయార్క్ లో యూఎస్ ఓపెన్ టెన్నిస్ పోటీలను ధోనీ ఆస్వాదించాడు. యూఎస్ ఓపెన్ లో వరల్డ్ నెంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్, జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ ల మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కు ధోనీ కూడా హాజరయ్యాడు. అల్కరాజ్ బెంచ్ కు వెనుకగా కూర్చుకున్న ధోనీ పలుమార్లు టీవీలో కనిపించాడు. అభిమానులు ధోనీని గుర్తించి, వీడియో ఫుటేజిలోని క్లిప్పింగ్స్ ను, ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Next Story