రాజస్థాన్ రాయల్స్‌తో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరగులు చేసింది. అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులకు మాత్రమే పరిమితమైంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ధోని 7వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. 17 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేశాడు. ఆరు బంతుల తరువాత కానీ ధోని పరుగుల ఖాతాని తెరవలేకపోయాడు.
కాగా.. ధోని బ్యాటింగ్ తీరుపై గత కొద్ది రోజులుగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడాడు. తాను నిదానంగా బ్యాటింగ్ చేయడం వల్ల చెన్నై జట్టుకు నష్టం కలిగిస్తుందని.. దీనిని అంగీకరిస్తున్నానని చెప్పాడు. అయితే.. ఎప్పుడూ ఉత్తమ ప్రదర్శన చేస్తానని హామీ ఇవ్వలేననని చెప్పాడు. మనం మెరుగ్గా ఆడుతున్నప్పుడు ఆన్‌పిట్ అని ఏ ఒక్కరూ అనరని.. ఇది నిజమన్నాడు. తనకు 24 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బాగా రాణిస్తానని అప్పుడు హామీ ఇవ్వలేదని.. ఇప్పుడు 40 వయస్సులో కూడా హామీ ఇవ్వలేనని చెప్పాడు ధోని.