ట్రైనింగ్ సెషన్‌లో 'హెలికాప్టర్ షాట్' ఆడిన ధోనీ.. వీడియో వైర‌ల్‌..!

మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ 2024 కోసం సిద్ధమవుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ట్రైనింగ్ సెషన్‌లో తన ఐకానిక్ హెలికాప్టర్ షాట్ ఆడాడు.

By Medi Samrat  Published on  20 March 2024 9:01 AM GMT
ట్రైనింగ్ సెషన్‌లో హెలికాప్టర్ షాట్ ఆడిన ధోనీ.. వీడియో వైర‌ల్‌..!

మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ 2024 కోసం సిద్ధమవుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ట్రైనింగ్ సెషన్‌లో తన ఐకానిక్ హెలికాప్టర్ షాట్ ఆడాడు. దీంతో అత‌డు పాత జ్ఞాపకాలను గుర్తుచేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్ CSK శుక్రవారం RCBతో తన మొద‌టి మ్యాచ్ ఆడుతుంది.

MS ధోని తన పొడవాటి జుట్టుతో ఉన్న లుక్‌తో ఆక‌ట్టుకుంటున్నాడు. ప్ర‌స్తుతం అత‌డు శిక్షణలో చురుకుగా పాల్గొంటున్నాడు. నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తూ ఫామ్‌ను అందిపుచ్చుకునే ప్ర‌యత్నాలు చేస్తున్నాడు. సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ కూడా కెప్టెన్ ధోనీ బ్యాటింగ్‌ను నిశితంగా పరిశీలిస్తున్నాడు.

ఐపీఎల్ 2024 ఎంఎస్ ధోనీకి చివరి సీజన్ కావచ్చని అంచనాలు ఉన్నాయి. దీంతో అత‌డు ఈ సీజ‌న్‌ను చిరస్మరణీయంగా ముగించాలనుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. అభిమానుల కోసం మరో సీజన్ ఆడేందుకు ప్రయత్నిస్తానని ఎంఎస్ ధోని గతేడాది చెప్పాడు.

అయితే, MS ధోని ప్రాక్టీస్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో అతను CSK బౌలర్లను చిత్తు చేశాడు. ప్రాక్టీస్‌లో ఐకానిక్ హెలికాప్టర్ షాట్ ఆడాడు. ఆ షాట్ సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్ల‌ ప్రశంసలు అందుకుంది. బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ ఎంఎస్ ధోనీతో మాట్లాడినట్లు వీడియోలో కనిపించింది.

ఎంఎస్ ధోనీ సాధారణంగా లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తాడు. అయితే CSK అభిమానులు మాత్రం ధోనీని చాలా సేపు బ్యాటింగ్ చేయాలని ఆశిస్తున్నారు. ఇందుకోసం కెప్టెన్ కొంచెం ముందుగా బ్యాటింగ్ చేయడానికి రావాల‌ని ఆశిస్తున్నారు. ప్రస్తుతం డెవాన్ కాన్వాయ్ గాయపడ్డాడు కాబట్టి ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏమైనా మార్పులు చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. మార్చి 22న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో త‌న మొద‌టి మ్యాచ్ ఆడ‌నుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ 2024 సంబరాలు మొద‌ల‌వ‌నున్నాయి.


Next Story