క్యాండీ క్రష్‌ ఆడిన ధోనీ.. కొద్ది గంటల్లోనే లక్షల డౌన్‌లోడ్స్‌

ఇటీవల ఎంఎస్‌ ధోనీ విమానంలో ప్రయాణించారు. ఎయిర్‌హోస్టెస్‌ ధోనీకి చాక్లెట్స్‌ ఇచ్చింది. అవి తీసుకున్న ఆయన..

By Srikanth Gundamalla  Published on  26 Jun 2023 5:06 AM GMT
MS Dhoni, Candy Crush, Flight, Viral Video

క్యాండీ క్రష్‌ ఆడిన ధోనీ.. కొద్ది గంటల్లోనే లక్షల డౌన్‌లోడ్స్‌

ఇండియన్ మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని అందరికీ తెలుసు. ఆయనకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ సీజన్‌-2023లోనే ఇది తెలిసిపోయింది. గ్రౌండ్‌ ఎక్కడైనా ధోనీ ఫ్యాన్స్ హడావిడి చేశారు. సీఎస్‌కే మ్యాచ్‌ ఉందంటే చాలు స్టేడియం మొత్తం ఎల్లో కలర్‌లోకి మారిపోవడం చూశాం. ఉత్కంఠ పోరులో చివరకు సీఎస్‌కే ఐపీఎల్‌ సీజన్-2023 టైటిల్‌ కూడా గెలుచుకుంది. టీమిండియాకు కూడా ఎంఎస్‌ ధోనీ ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. 2007 టీ20 వరల్డ్‌ కప్.. 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీల్లో భారత్‌ను విజేతగా నిలిపాడు. అయితే.. మాహీ ఏం చేసినా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఫ్యాన్స్‌ కూడా దాన్ని ఫాలో అవుతుంటారు. సరిగ్గా ఇలాంటిదే తాజాగా ఒకటి జరిగింది. విమాన ప్రయాణం చేస్తోన్న ధోనీ క్యాండీ క్రష్‌ ఆడాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. వైరల్‌ అవ్వడం ఏమో కానీ కొన్ని లక్షల మంది క్యాండీ క్రష్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

ఇటీవల ఎంఎస్‌ ధోనీ విమానంలో ప్రయాణించారు. ఎయిర్‌హోస్టెస్‌ ధోనీకి చాక్లెట్స్‌ ఇచ్చింది. అవి తీసుకున్న ఆయన.. ఆమెతో మాట్లాడారు. ఆ సమయంలోనే వీడియో తీశారు. ఆ తర్వాత దాన్ని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయగా తెగ వైరల్ అవుతోంది. అయితే.. ప్లేన్‌లో ఉన్న సమయంలో మహీ తన ట్యాబ్‌లో క్యాండీ క్రష్‌ ఆడారు. ఈ విషయం క్రీడా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. దీంతో #Candycrush ను ట్విట్టర్‌లో ట్రెండ్ చేయడం ప్రారంభించారు. ఇదే సమయంలో ఈ గేమ్‌ను కొద్ది గంటల్లోనే విపరీతంగా డౌన్‌లోడ్స్ చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా క్యాండీ క్రష్ తన అధికారిక పేజీలో వెల్లడించింది. తమ గేమ్‌ ఆడుతున్నందుకు ఎంఎస్‌ ధోనీకి క్యాండీ క్రష్‌ మేనేజ్‌మెంట్‌ థ్యాంక్స్‌ కూడా చెప్పింది. 3 గంటల్లో 30 లక్షల మందికి పైగా క్యాండీ క్రష్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపింది. ఇక ధోనీ ఇలా గేమ్ ఆడుతూ కనిపించడం ఇదే మొదటిసారు కాదు. ఎక్కువగా పబ్జీ, FIFA, కాల్‌ ఆఫ్‌ డ్యూటీ ఆడతాడు. మైదానంలో గేమ్స్‌ ఆడటమే కాదు... సెల్‌ఫోన్‌ గేమ్స్‌ను కూడా ధోనీ ఎంజాయ్ చేస్తాడు.

Next Story