సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న ధోని స‌రికొత్త అవ‌తారం

MS Dhoni Pandit Avatar Phots Goes Viral On Social Media.టీమ్ఇండియా మాజీ సార‌థి, చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Aug 2022 6:09 AM GMT
సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న ధోని స‌రికొత్త అవ‌తారం

టీమ్ఇండియా మాజీ సార‌థి, చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండ‌డు అన్న సంగ‌తి తెలిసిందే. అయితే అత‌డి స‌తీమ‌ణి సాక్షి సింగ్ మాత్రం సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ధోనికి సంబంధించిన ఫోటోలు, వీడియోల‌ను పోస్ట్ చేస్తుంటారు. ఆ వీడియోలు, ఫోటోలు క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతుంటాయి.

తాజాగా ధోని పండితుడి వేషధారణలో కనిపిస్తున్న పోటోలు ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారాయి. ఓ ఫోటోలో మహీ పసుపు రంగు కుర్తా ధరించి చేతికి దండ వేసుకున్నారు. ఇంకో ఫొటోలో సంస్కారం చేస్తుండగా.. ఇంకో ఫొటోలో ఉపదేశం చేస్తున్నట్లు ఉంది. 'ఇసికామహి' అనే ఇన్‌స్టాగ్రామ్ యూజ‌ర్ ఈ ఫోటోల‌ను పోస్ట్ చేశారు. ఇవి ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి. నెటీజ‌న్లు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. ఇది ఏదో యాడ్ షూటింగ్‌కు సంబంధించిన‌దిగా తెలుస్తోంది.

ఆగ‌స్టు 15, 2020లో ధోని అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. టీమ్ఇండియా త‌రుపున ధోని 350 వన్డే మ్యాచ్‌ల్లో 10,773 రన్స్‌ బాదారు. ఇందులో 10 సెంచరీలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 183‌. 90 టెస్టుల్లో 4,876 పరుగులు చేశారు. ఇందులో 6 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 98 టీ20 మ్యాచ్‌లలో 1,617 పరుగుల చేశారు. ఐపీఎల్ టోర్నీలో 234 మ్యాచుల్లో 4,978 రన్స్ బాదారు.

Next Story