చైర్ లకు పెయింట్ వేసిన మహేంద్ర సింగ్ ధోని
By Medi SamratPublished on : 27 March 2023 11:42 AM

ఐపీఎల్ 16వ ఎడిషన్‌కు ఇంకొన్ని రోజులే ఉంది. మార్చి 31వ తేదీ నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. మెగా టోర్నీ కోసం చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధమవుతోంది. ముమ్మర ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ధోనీ కాసేపు సరదాగా గడిపారు. స్టేడియంలో ప్రేక్షకులు కూర్చునే కుర్చీలకు ధోనీ స్వయంగా పెయింటింగ్ వేశారు. పసుపు, బ్లూ రంగు కుర్చీలకు కలర్ క్యాన్లతో స్ప్రే కొట్టాడు.
MS ధోని చెన్నై సూపర్ కింగ్స్ మధ్య విడదీయరాని బంధం ఉంది. 2008లో ప్రారంభ IPL ఎడిషన్ నుండి చెన్నై సూపర్ కింగ్స్ కు ధోని నాయకత్వం వహిస్తూ వస్తున్నాడు. MA చిదంబరం స్టేడియం సీట్లకు స్ప్రే క్యాన్‌తో రంగులు వేస్తున్న ధోనీకి సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్ ఖాతాలో అప్లోడ్ చేశారు.
IPL 2023లో చెన్నై సూపర్ కింగ్స్ తమ మొదటి మ్యాచ్ ను మార్చి 31న ఆడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. CSK తమ సొంత గ్రౌండ్ అయిన చెపాక్ స్టేడియంలో ఏప్రిల్ 6న KL రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్‌తో ఆడుతుంది.
Next Story