సీఎస్కే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ.. అతనే సారథి

మార్చి 22 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 సీజన్ మొదలు కాబోతుంది.

By Srikanth Gundamalla  Published on  21 March 2024 4:44 PM IST
ms dhoni, chennai captaincy, ipl-2024,

సీఎస్కే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ.. అతనే సారథి

శుక్రవారం నుంచే క్రికెట్ పండగ మొదలు కానుంది. మార్చి 22 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 సీజన్ మొదలు కాబోతుంది. ఈ సీజన్‌లో తొలి రోజే ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌ కింగ్స్, బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్ టీమ్‌లు ఫస్ట్‌డే తలబడబోతున్నాయి. అయతే.. ఐపీఎల్‌ సీజన్ ప్రారంభానికి ముందు రోజే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌ అనగానే ఎవరికైనా గుర్తొచ్చే ఒకే ఒక వ్యక్తి ఎంఎస్‌ ధోనీ. ఆయన పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. కెప్టెన్‌ కూల్‌గా పేరు సంపాదించుకున్న ఆయన.. చెన్నైని స్ట్రాంగెస్ట్‌ టీమ్‌గా నడిపించాడు. అయితే.. ఎంఎస్‌ ధోనీ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నాడు. సీఎస్కే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇక మాహీ స్థానంలో ఆ జట్టుకు కెప్టెన్‌గా యంగ్‌స్టర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ సారథిగా వ్యవహరించనున్నాడు.

ఎంఎస్‌ ధోనీ ఐపీఎల్ ప్రారంభమైన 2008 సీజన్‌ నుంచి చెన్నై జట్టుకి కెప్టెన్‌గా కొనసాగుతూ వస్తున్నాడు. 2013 మినహా అన్ని సీజన్లకు కెప్టెన్‌గా సేవలందించాడు. 2022 సీజన్‌ ప్రారంభంలో జడేజాకు పగ్గాలు ఇచ్చారు. కానీ.. 8 మ్యాచ్‌ల తర్వాత మళ్లీ ధోనీకే కెప్టెన్సీని అప్పగించారు. ఐపీఎల్ జట్టుకు 212 మ్యాచ్‌లకు ధోనీ కెప్టెన్‌గా కొనసాగాడు. 1298 మ్యాచులు గెలవగా.. 82 మ్యాచుల్లో ఓటమిని చూశాడు ధోనీ. 2023 ఐపీఎల్ సీజన్‌లో ఫైనల్‌కు చేరిన చెన్నై.. ఆ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై విజయం సాధించి కప్‌ను సొంతం చేసుకుంది. ఐదోసారి టైటిల్ గెలిచిన టీమ్‌గా నిలిచింది. ఇక మరోవైపు ఎంఎస్‌ ధోనీ ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు.

Next Story