ఆ విషయం తెలిసే రోహిత్ భాయ్ నన్ను జట్టు నుంచి తప్పించాడు.. నేను జీర్ణించుకోలేకపోయాను
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కలేదు.
By Medi Samrat
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కలేదు. తాను జట్టులోకి ఎంపిక కాకపోవడంతో జీర్ణించుకోలేకపోతున్నానని సిరాజ్ తెలిపాడు. ODI ప్రపంచ కప్ 2023, T20 ప్రపంచ కప్ 2024లో భారత జట్లకు ఎంపికైన మహమ్మద్ సిరాజ్, ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాలేదు. అయితే టీమ్ మేనేజ్‌మెంట్ ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేసింది. సిరాజ్‌ను నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఉంచారు. కానీ అతని అవసరం రాలేదు.
మహమ్మద్ సిరాజ్ ప్రస్తుతం IPL 2025లో బిజీగా ఉన్నాడు. అతడు గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో గుజరాత్ జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. సిరాజ్ ఐపీఎల్ 2025లో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నాడు.
దేశం తరఫున ఆడడం తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని సిరాజ్ పేర్కొన్నాడు. రోహిత్ శర్మ, టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకునే నిర్ణయం జట్టుకు మేలు చేస్తుందని తనకు తెలుసునని సిరాజ్ అన్నాడు.
దేశం తరఫున ఆడినప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతర్జాతీయ ఆటగాడిగా మీరు ఎల్లప్పుడూ ICC ఈవెంట్‌లను ఆడాలని కోరుకుంటారు. మొదట్లో నేను జట్టులో లేనని జీర్ణించుకోలేకపోయాను. రోహిత్ భాయ్ జట్టుకు ఏది మంచిదో అదే చేస్తాడు. అతనికి చాలా అనుభవం ఉంది. దుబాయ్ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు పెద్దగా సహకరించదని తెలుసు. స్పిన్నర్లు అక్కడ కలిసివస్తుంది. అందుకే ఆ విషయం తెలిసిన నిపుణుడైన రోహిత్ నన్ను తొలగించాలని నిర్ణయించుకున్నాడని పేర్కొన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో విరామ సమయంలో తన ఫిట్‌నెస్, బౌలింగ్‌పై తాను పనిచేశానని సిరాజ్ చెప్పాడు. తన తప్పులను గుర్తించకుండా చాలా కాలంగా ఆడుతున్నానని చెప్పాడు. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలవడమే అతిపెద్ద విషయమని సిరాజ్ అన్నాడు.
చాలా సేపు కంటిన్యూగా ఆడుతున్నాను. కాబట్టి విరామం సమయంలో నేను నా ఫిట్‌నెస్, బౌలింగ్‌పై పనిచేశాను. మనం ఆడుతున్నప్పుడు ఏమి తప్పులు చేస్తున్నామో మనకు తెలియదు. కాబట్టి ఇది మంచి విరామం.. మేము ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకున్నాము. ఇది చాలా గొప్ప విషయం అని పేర్కొన్నాడు.