అందులోనూ చోటు దక్కలేదు.. షమీకి మళ్లీ నిరాశే..!
న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో ఓటమి తర్వాత భారత జట్టు ఇప్పుడు ఆస్ట్రేలియాతో తదుపరి టెస్ట్ సిరీస్ ఆడనుంది
By Medi Samrat Published on 4 Nov 2024 8:30 PM ISTన్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో ఓటమి తర్వాత భారత జట్టు ఇప్పుడు ఆస్ట్రేలియాతో తదుపరి టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం టీమిండియా త్వరలో ఆస్ట్రేలియా బయలుదేరనుంది. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి భారత జట్టును కూడా ప్రకటించారు.
2023 వన్డే ప్రపంచకప్ తర్వాత ఆటకు దూరమైన మహమ్మద్ షమీకి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి భారత జట్టులో చోటు దక్కలేదు. ఇప్పుడు మరో జట్టులో కూడా షమీకి అవకాశం రాలేదు. రంజీ ట్రోఫీ తర్వాతి రెండు రౌండ్లలో షమీకి బెంగాల్ జట్టులో చోటు దక్కలేదు. బెంగాల్ కర్ణాటక, మధ్యప్రదేశ్‌తో తలపడనుంది.
చీలమండ గాయం నుంచి కోలుకున్నప్పటికీ మహ్మద్ షమీ ఆటకు దూరంగా ఉన్నాడు. గత నెలలో జరిగిన ఓ ఈవెంట్‌లో షమీ మాట్లాడుతూ.. తాను 100% బౌలింగ్ చేయడం ప్రారంభించానని, ఫలితాలు బాగున్నాయి అని పేర్కొన్నాడు. బెంగాల్ జట్టులో ఆకాశ్‌దీప్‌కు కూడా చోటు దక్కలేదు. ఇటీవల ముగిసిన న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో అతను భారత జట్టు తరుపున ఆడాడు.
బెంగాల్ జట్టు..
అనుస్తుప్ మజుందార్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), సుదీప్ ఛటర్జీ, సుదీప్ ఘరామి, షహబాజ్ అహ్మద్, హృతిక్ ఛటర్జీ, ఎవెలిన్ ఘోష్, షువామ్ డే, షకీర్ హబీబ్ గాంధీ, ప్రదీప్త ప్రమాణిక్, అమీర్ హబీబ్ గాంధీ, ప్రదీప్త ప్రమాణిక్, అమీర్ ఘాని, ఇషాన్ పొరెల్, ఇషాన్ పోరెల్, జవాల్ రోహిత్ కుమార్, రిషవ్ వివేక్.
భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ తన కెరీర్‌లో ఇప్పటివరకూ 64 టెస్టులు ఆడి 122 ఇన్నింగ్స్‌లలో 27.71 సగటుతో 3.30 ఎకానమీతో 229 వికెట్లు తీశాడు. 9/118 టెస్టులో అతని అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. షమీ టెస్టుల్లో బ్యాటింగ్ కూడా బాగా చేశాడు. ఈ ఫార్మాట్‌లో 2 అర్ధసెంచరీల సాయంతో 750 పరుగులు చేశాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.
ట్రావెలింగ్ రిజర్వ్
ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్.