మహ్మద్ షమీకి ఊహించని షాకిచ్చిన హసీన్ జహాన్
Mohammed Shami's estranged wife Hasin Jahan drops his surname from daughter's name.టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అతడి భార్య హసీన్ జహాన్ ఊహించని షాక్ ఇచ్చింది.
By తోట వంశీ కుమార్ Published on 3 Feb 2021 4:28 AM GMTటీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకిhis 2018లో విభేదాలు రావడంతో.. ఈ ఇద్దరూ అప్పటి నుంచి వేరువేరుగా ఉంటున్నారు. ఇక కూతురు ఐరా అంటే షమీకి చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఎన్నో సందర్భాల్లో షమీ బహిరంగంగానే చెప్పాడు. తన కుమారై ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ప్రేమను వ్యక్తం చేస్తుండేవాడు. భార్యకు దూరంగా ఉంటున్నప్పటికి కూతురు ఐరా కోసం షమీ అప్పుడుప్పుడు ఆమె ఇంటికి వెలుతుండేవాడు. అయితే.. తాజాగా ఐరాను అతనికి దూరం చేసే పనిలో హసీన్ జహాన్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే తన కుమారై ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఐరా. ఆ ఫోటోలో ఐరా పేరుకు షమీ సర్‌నేమ్‌ను తొలగించి ఐరా జహాన్ అంటూ క్యాప్షన్ జతచేసింది. షమీని కూతురుకు పూర్తిగా దూరం చేయాలనే ఆలోచనతోనే హసీన్ జహాన్ ఈ పనిచేసినట్లు తెలుస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఛీర్ గర్ల్‌గా పనిచేసిన హసీన్ జహాన్‌ను అప్పట్లో షమీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. కానీ ఆతరువాత హసీన్ జహాన్ షమీపై తీవ్ర ఆరోపణలు చేసింది. అతడు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని, తప్పుడు వయసు పత్రాలతో భారత జట్టులోకి వచ్చాడని విమర్శలు గుప్పించింది.
గృహ హింస, లైంగింక వేదింపులకు పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. మ్యాచ్‌ఫిక్సింగ్, తప్పుడు వయసు పత్రాలతో వంటి ఆరోపణలు చేయడంతో.. ఈ విషయాలపై బీసీసీఐ సీరియస్ అయింది. అతడి సెంట్రల్ కాంట్రాక్టును హోల్డ్‌లో పెట్టింది. అనంతరం విచారణ చేపట్టిన బీసీసీఐ.. అతడు ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని, తప్పుడు వయసు పత్రాలను ఇవ్వలేదని నిర్ధారించి.. అతడి కాంట్రాక్టును పునరుద్దరించింది. షమీకి దూరమైన జహాన్ గత ఏడాది నుంచి మోడలింగ్‌ను మొదలుపెట్టింది. సందర్భం దొరికిన ప్రతీసారి సోషల్ మీడియాలో షమీ స్వార్థపరుడంటూ ఆరోపణలు గుప్పించడంతో పాటు హాట్ హాట్ ఫోటోలతో అభిమానులను రెచ్చగొట్టేంది. అప్పట్లో ఈ టార్చర్ భరించలేక షమీ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. కుటుంబ సభ్యుల సాయంతో.. అలాంటి ఆలోచనల నుంచి బయటకు వచ్చినట్లు తెలిపాడు. ఆ తరువాత క్రికెట్‌పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాడు.
కాగా.. ఆసీస్‌తో డిసెంబర్‌లో జరిగిన మొదటి టెస్టులో షమీ గాయపడ్డాడు. రెండో ఇన్నింగ్స్‌లో చివరగా బ్యాటింగ్‌కు వచ్చిన షమీ మణికట్టు గాయంతో రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఎక్స్-రేలో గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలడంతో మిగిలిన టెస్టు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌లోనే టీమ్ఇండియా 36 పరుగులకే ఆలౌట్ అయి ఘోరపరాజయంతో పరువు తీసుకుంది. ఆతరువాత విజృంభించి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఫిబ్రవరి 5 నుంచి భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది.