మరో స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్

Mohammad Hafeez retires from international cricket.పాకిస్థాన్ ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు

By M.S.R  Published on  3 Jan 2022 6:49 AM GMT
మరో స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్

పాకిస్థాన్ ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు జనవరి 3 (సోమవారం)న‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. హఫీజ్ చివరిసారిగా T20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ తరపున ఆడాడు. అతడు ఆడిన ఆఖరి మ్యాచ్ లో గత ఏడాది UAEలో జరిగిన సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్థాన్‌ ఓటమి పాలైంది.

మహ్మద్ హఫీజ్ ప్రపంచవ్యాప్తంగా పలు క్రికెట్ లీగ్ లు ఆడుతానని తెలిపాడు. 41 ఏళ్ల హఫీజ్ పాకిస్థాన్‌లో సోమవారం ఉదయం విలేకరుల సమావేశంలో రిటైర్మెంట్ ప్రకటించాడు. జనవరి 27 నుండి ప్రారంభమయ్యే పాకిస్తాన్ సూపర్ లీగ్ యొక్క రాబోయే ఎడిషన్‌లో హఫీజ్ లాహోర్ ఖలందర్స్ తరపున ఆడనున్నాడు. ఈ రోజు నేను గర్వంగా, సంతృప్తితో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాను అని హఫీజ్ తెలిపాడు. వాస్తవానికి, నేను మొదట్లో ఊహించిన దానికంటే ఎక్కువ సాధించాను. నా కెరీర్‌లో నాకు సహాయం చేసిన నా తోటి క్రికెటర్లు, కెప్టెన్లు, సహాయక సిబ్బంది, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అందరికీ ధన్యవాదాలని తెలిపాడు. 18 సంవత్సరాలుగా పాకిస్తాన్ చిహ్నంతో జాతీయ కిట్‌ను ధరించడానికి నేను చాలా అదృష్టవంతుడిని అందుకు గర్విస్తున్నానని చెప్పుకొచ్చాడు.

2003లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హఫీజ్ 218 వన్డేలు ఆడి 11 సెంచరీలు, 38 అర్ధసెంచరీలతో సహా 6614 పరుగులు చేశాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో 139 వికెట్లు తీశాడు. 119 టీ20ల్లో 2514 పరుగులు చేసి 61 వికెట్లు తీశాడు. హఫీజ్ 2018లో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను 55 మ్యాచ్‌లు ఆడి 10 సెంచరీలతో సహా 3652 పరుగులు చేశాడు.

Next Story