మ్యాచ్‌లు ఆడ‌డు.. కానీ ఆర్సీబీతో కాంట్రాక్ట్ ఉంటుంది..!

ఐపీఎల్ 2026కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్‌సిబికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

By -  Medi Samrat
Published on : 24 March 2026 4:05 PM IST

మ్యాచ్‌లు ఆడ‌డు.. కానీ ఆర్సీబీతో కాంట్రాక్ట్ ఉంటుంది..!

ఐపీఎల్ 2026కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్‌సిబికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్ జట్టులో భాగం కాడని ఆర్‌సిబి క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ ధృవీకరించారు. అతను ఐపీఎల్ 2026లో ఆడడు.. కానీ ఫ్రాంచైజీతో ఒప్పందం కింద కొనసాగనున్నాడు. అతనిపై ఉన్న తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలు, లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆర్‌సిబి శిక్షణా సెషన్‌లకు యశ్ దయాల్ గైర్హాజరైన తర్వాత ఫ్రాంచైజీ అతనికి అవకాశం ఇవ్వకపోవచ్చనే పుకార్లు రావడం మొదలయ్యాయి. ఇప్పుడు ఐపీఎల్ 2026లో యశ్ దయాల్ ఆర్‌సిబి తరఫున ఆడబోడని ధృవీకరించబడింది. ఆర్‌సిబి డైరెక్టర్ మో బోబాట్.. యశ్ దయాల్ ప్రస్తుతం ఒక వ్యక్తిగత సమస్యను ఎదుర్కొంటున్నందున, అతను ఐపీఎల్ 2026లో పాల్గొనలేడని స్పష్టంగా తెలిపారు. అయి.. దయాల్ ఆర్‌సిబితో ఒప్పందం కిందనే ఉంటాడని కూడా ఆయన పేర్కొన్నారు. గత ఏడాది వేలానికి ముందు యశ్‌ను ఆర్‌సిబి ₹5 కోట్లకు అట్టిపెట్టుకుంది. అతడు 2022లో గుజరాత్ టైటాన్స్‌తో తన ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి.. అదే సంవత్సరం ఆ జట్టు టైటిల్ గెలవ‌డంలో త‌న వంతు పాత్ర పోషించాడు.

Next Story