బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా దేశీయ స్టార్ ఆటగాడు మిథున్ మన్హాస్ నియమితులయ్యారు.
By - Knakam Karthik |
బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా దేశీయ స్టార్ ఆటగాడు మిథున్ మన్హాస్ నియమితులయ్యారు. ముంబైలో జరిగిన బీసీసీఐ వార్షిక సమావేశంలో మిథున్ ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. భారత మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, రోజర్ బిన్నీ తరువాత వరుసగా బీసీసీఐ చీఫ్ అయిన మూడో క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. బీసీసీఐ కి 37 అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు నిర్వహించబోతున్నాడు. రోజర్ బిన్నీ నిష్క్రమణతో బోర్డు అధ్యక్ష పదవికి ఖాళీ ఏర్పడింది. దీంతో ఈ పదవిలోకి 45 ఏళ్ల మన్హాస్ ఎంపికయ్యారు. ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా, కార్యదర్శిగా దేవజిత్ సైకియా కొనసాగనున్నారు. ట్రెజరర్‌గా రఘురామ్‌భట్, జాయింట్ సెక్రటరీగా ప్రభుతేజ్‌సింగ్ భాటియా ఎంపికయ్యారు.
దేశవాలీ స్టార్.. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూలో జన్మించిన మిథున్.. 1997-98 నుంచి 2016 మధ్య 157 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో 43 సగటుతో 27 సెంచరీలు సాధించాడు. 49 అర్థ సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి. పదివేలకు పైగా పరుగులు సాధించాడు. ఆఫ్ బ్రేక్ బౌలింగ్ లో 40 కి పైగా వికెట్లు పడగొట్టాడు. కీపర్ గాను కొన్ని సంవత్సరాలు తన నైపుణ్యాలు ప్రదర్శించాడు. ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్, పూణే వారియర్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. అలాగే వివిధ ఐపీఎల్ జట్లకు అసిస్టెంట్ కోచ్ హోదాలో కూడా పనిచేశాడు. ఆగష్టులో బిన్నీ తరువాత రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా పనిచేశాడు. మిథున్ రాకతో ఆయన ఉపాధ్యక్షుడిగా కొనసాగుతారు. భారత మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లయిన ఆర్పీసింగ్, ప్రజ్ఞాన్ ఓజా కూడా పురుషుల సెలక్షన్ ప్యానెల్ లోకి ప్రవేశించాడు.
కొత్త అధ్యక్షుడు మన్హాస్ ఎంపికను జమ్మూకు చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో ఎక్స్ లో ఆయన ఘనతను స్వాగతించారు 'బీసీసీఐకు కొత్త ప్రెసిడెంట్‌గా మిథున్ మన్హాస్ ఎంపికయ్యారు. జమ్ము కశ్మీర్‌లోని దోడా జిల్లాకు ఇది దివ్యమైన రోజు (ఆదివారం). నా సొంత జిల్లా కూడా ఇదే కావడం ఇది యాదృచ్ఛికం. కొన్ని గంటల వ్యవధిలో, తొలుత కిష్త్వార్ ప్రాంతానికి చెందిన ముద్దుబిడ్జ శీతల్ ప్రపంచ అథ్లెట్స్ ఛాంపియన్‌లో గోల్డ్ మెడల్ నెగ్గింది. ఆ తర్వాత భదేర్వాకు చెందిన మిథున్ అత్యున్నత స్థానం దక్కించుకున్నారు' అని జితేంద్ర ఎక్స్‌లో రాసుకొచ్చారు.
A momentous occasion to celebrate!Mithun Manhas has been officially declared as the new President of the ‘Board of Control for Cricket in India’ #BCCI.What a providential Sunday for the erstwhile district of Doda, one of the remotest parts of Jammu & Kashmir, which incidentally… pic.twitter.com/I6PpEMtH2T
— Dr Jitendra Singh (@DrJitendraSingh) September 28, 2025