Mithali Raj First Woman Cricketer To Score 7,000 Runs In ODIs.మహిళా క్రికెట్ లో భారత్ మహిళల వన్డే కెప్టెన్ మిథాలీ వన్డేల్లో 7వేల పరుగులు చేసిన తొలి బ్యాట్‌వుమెన్‌గా నిలిచింది
మహిళా క్రికెట్ లో భారత్ మహిళల వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ మెరుపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మిథాలీరాజ్ మరో అరుదైన ఘనతను సాధించింది. కొద్దిరోజుల కిందటే పదివేల అంతర్జాతీయ పరుగులు చేసిన రెండో మహిళా క్రికెటర్‌గా నిలిచిన మిథాలీ.. ఇప్పుడు వన్డేల్లో 7వేల పరుగులు చేసిన తొలి బ్యాట్‌వుమెన్‌గా నిలిచింది. ఉత్తరప్రదేశ్‌లోని అటల్ బిహారి వాజ్‌పేయి స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో 26వ పరుగుల వద్ద మిథాలీ ఈ మైలురాయిని అందుకుంది. తర్వాతి స్థానాల్లో ఇంగ్లాండ్‌కు చెందిన చార్లెట్ ఎడ్వర్డ్స్(5992), ఆస్ట్రేలియాకు చెందిన బెలిందా క్లార్క్ (4844) ఉన్నారు.
Magnificent Mithali! 🙌🙌#TeamIndia ODI skipper becomes the first woman cricketer to score 7⃣0⃣0⃣0⃣ ODI runs. 👏👏
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లో 10 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి భారత మహిళా క్రికెటర్ గా చరిత్ర సృష్టించిన మిథాలీ... ఇప్పుడు మరో రికార్డును తన ఖాతాలో వేసుకోవడం పట్ల పలువురు శుభాకాంక్షలు తెలిపారు. 38 ఏళ్ల మిథాలీ ఇటీవల ప్రపంచ మహిళా క్రికెట్ చరిత్రలో 10వేల పరుగులు పూర్తి చేసిన రెండో క్రికెటర్‌గా, తొలి భారతీయ వుమెన్ క్రికెటర్‌గా నిలిచింది. 1999లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన మిథాలీరాజ్.. ఇప్పటి వరకు 213 వన్డే మ్యాచుల్లో.. 50.7 సగటుతో 7008 పరుగులు చేయగా.. ఇందులో ఏడు సెంచరీలు, 54 అర్ధసెంచరీలు సాధించింది.