టీమ్ఇండియా అద్భుత విజయం.. కెప్టెన్‌తో కోచ్ గొడవ
Mickey Arthur fights with Dasun Shanaka.కొలంబో వేదికగా మంగళవారం రాత్రి జరిగిన రెండో వన్డేలో భారత జట్టు అద్భుత
By తోట వంశీ కుమార్ Published on 21 July 2021 1:46 PM ISTకొలంబో వేదికగా మంగళవారం రాత్రి జరిగిన రెండో వన్డేలో భారత జట్టు అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గెలుపు ఆశలే లేని స్థితి నుంచి భారత జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు దీపక్ చాహర్ (69 నాటౌట్; 82 బంతుల్లో 7పోర్లు, 1సిక్స్). దీంతో లంకపై భారత జట్టు మూడు వికెట్ల తేడాతో గెలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచులో శ్రీలంక జట్టు ప్రధాన కోచ్ మికీ ఆర్థర్, లంక కెప్టెన్ దాసున్ షనకల మధ్య జరిగిన మాటల యుద్ధం ప్రస్తుతం వైరల్‌గా మారింది.
తొలుత భారత జట్టు ఓటమి దిశగా సాగుతుండగా.. డ్రెస్సింగ్ రూమ్‌లో సంతోషంగా కనిపించిన ఆర్థర్.. దీపక్ చహర్, భువనేశ్వర్ కుమార్‌ల ఇన్నింగ్స్ అతడిని సహనం కోల్పోయేలా చేశాయి. ఈ సందర్భంగా అతను డ్రెస్సింగ్ రూమ్‌లో కోపంతో విచిత్రమైన హావభావాలు ఇచ్చాడు. పదేపదే డగౌట్‌లోకి వచ్చి అసహనం వ్యక్తం చేశాడు. ఇక మ్యాచ్ చివర్లో లంక ఓటమి దాదాపు ఖామమైంది. ఈ నేపథ్యలోనే ఆర్థర్ మ్యాచ్ మధ్యలో మైదానంలోకి వచ్చి కెప్టెన్ షనకతో ఏదో చర్చించాడు.
— cric fun (@cric12222) July 20, 2021
ఆర్థర్ ఏవో సైగలు చేస్తేంటే షనక కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చాడు. ఇరువరి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.