క్రికెట్ ఆడుతున్న ఏనుగు.. ఆశ్చర్య పోయిన మైఖేల్ వాన్..!

Michael Vaughan shares a video of an elephant playing cricket.తాజాగా ఓ ఏనుగు మాత్రం క్రికెట్ ఆడగలను అని నిరూపించుకుంది. అది చూసిన ఇంగ్లండ్ క్రికెట్ లెజెండ్ మైఖేల్ వాన్ కూడా ఆశ్చర్యపోయారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 May 2021 2:37 PM IST
elephant playing cricket

కొన్ని జంతువులు మనుషులు చేసే చాలా పనులను చేస్తూ ఉంటాయి. గతంలో ఎన్నో జంతువులు మనుషులు ఆడే ఆటలను ఆడుతూ తామేమీ తక్కువ కాదని నిరూపించుకున్నాయి. తాజాగా ఓ ఏనుగు మాత్రం క్రికెట్ ఆడగలను అని నిరూపించుకుంది. అది చూసిన ఇంగ్లండ్ క్రికెట్ లెజెండ్ మైఖేల్ వాన్ కూడా ఆశ్చర్యపోయారు.

ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడనే విషయం తెలిసిందే..! క్రికెట్ కు సంబంధించిన చర్చలు మాత్రమే కాకుండా ఆసక్తికరమైన వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటారు. శనివారం నాడు మైఖేల్ వాన్ ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో ఓ ఏనుగు క్రికెట్ ఆడడం గమనించవచ్చు. ఆ ఏనుగు తొండంతో బ్యాట్ ను పట్టుకుని ఉండగా.. ప్లాస్టిక్ బాల్ ను విసురుతూ ఉన్నారు కొందరు యువకులు. ఆ బంతిని ఆ ఏనుగు బ్యాట్ తో కొడుతూ ఉండడాన్ని గమనించవచ్చు. వివిధ వైపులకు ఆ ఏనుగు బంతిని బాదుతూ కనిపించింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. వీడియోను చూసిన వాన్ "Surely the Elephant has an English passport !!" అంటూ షేర్ చేశాడు. ఇక మైఖేల్ వాన్ కు కౌంటర్ గా పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇక మైఖేల్ వాన్ ఐపీఎల్ నిలిచిపోవడంపై ఎంతో బాధను వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ఎంతో మందికి ఆనందాన్ని కలిగిస్తూ ఉందని.. ఇలాంటి కష్ట సమయాల్లో ఐపీఎల్ నిర్వహిస్తూ ఉండడం మంచి నిర్ణయమేనని చెప్పుకొచ్చాడు.




Next Story