జ‌కోవిచ్‌కు షాక్‌.. యూఎస్ ఓపెన్ విజేత మెద్వెదెవ్‌

Medvedev wins US Open 2021.యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో సంచ‌ల‌నం న‌మోదైంది. ప్ర‌పంచ నంబ‌ర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Sep 2021 3:33 AM GMT
జ‌కోవిచ్‌కు షాక్‌.. యూఎస్ ఓపెన్ విజేత మెద్వెదెవ్‌

యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో సంచ‌ల‌నం న‌మోదైంది. ప్ర‌పంచ నంబ‌ర్ వ‌న్ నోవాక్ జ‌కోవిచ్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. అత్య‌ధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచి రికార్డు సృష్టిద్దామ‌నుకున్న జ‌కోవిచ్ ఆశ‌లు గ‌ల్లంతు అయ్యాయి. ఫైన‌ల్‌లో మెద్వెదెవ్ చేతిలో జ‌కోవిచ్ 6-4,6-4,6-4 తేడాతో ఓట‌మి పాలైయ్యాడు. రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్‌ సంచలనం సృష్టించాడు. న్యూయార్క్ సిటిలోని ఆర్డ‌ర్ ఆషే స్టేడియంలో అభిమానులు సందోహం మ‌ధ్య ఈ మ్యాచ్ జరిగింది.

టైటిల్ కోసం జ‌కోవిచ్‌, మెద్వెదెవ్ నువ్వా నేనా అన్న‌ట్లు ఆడారు. తొలి సెట్‌ను 6-4 తేడాతో మెద్వెదెవ్ కైవ‌సం చేసుకున్నాడు. అయితే జకో అభిమానులంతా ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌లో లాగా తిరిగి పుంజుకుంటాడని ఆశపడ్డారు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తొలి రెండు సెట్లలో ఓడిపోయిన జకోవిచ్‌.. మిగిలిన సెట్లలో విజయం సాధించి ఆ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. అయితే చరిత్ర పునరావృతం చేస్తాడనుకున్న జకోకు మెద్వెదెవ్‌ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. 25 ఏళ్ల‌ మెద్వెదెవ్‌ వరుసగా మూడు సెట్లలో విజ‌యం సాధించి యూఎస్ ఓపెన్ విజేత గా నిలిచాడు. దాదాపు పదేళ్ల తరువాత‌ యూఎస్‌ ఓపెన్‌ టోర్నీలో ఒక్కసెట్‌లో మాత్రమే ఓడిపోయి టైటిల్‌ గెలిచిన ఆటగాడిగా నిలిచాడు.

Next Story