స్పీడ్ గ‌న్‌కు మళ్లీ గాయం.. ఫిట్‌గా ఎలా ప్ర‌క‌టించార‌ని ఫైర్‌..!

IPL 2025 సీజ‌న్‌కు బ్రేక్ రాగా.. ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు గ‌ట్టి షాక్ త‌గిలింది.

By Medi Samrat
Published on : 16 May 2025 11:51 AM IST

స్పీడ్ గ‌న్‌కు మళ్లీ గాయం.. ఫిట్‌గా ఎలా ప్ర‌క‌టించార‌ని ఫైర్‌..!

IPL 2025 సీజ‌న్‌కు బ్రేక్ రాగా.. ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు గ‌ట్టి షాక్ త‌గిలింది. LSG పునరాగమనం చేస్తుందని భావించారు.. కానీ ఇప్పుడు ఈ ఆశలు కూడా దెబ్బ తిన్నాయి. భారత ఫాస్టెస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ వెన్ను గాయం కారణంగా లీగ్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీని కారణంగా BCCI యొక్క 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' (గతంలో NCA) పై ప్రశ్నలు తలెత్తడం ప్రారంభించాయి. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

"మయాంక్ యాదవ్ వెన్ను గాయంతో బాధపడ్డాడు.. మిగిలిన సీజన్‌కు దూరంగా ఉన్నాడు" అని ఐపిఎల్ మీడియా ప్రకటన తెలిపింది. అతని స్థానంలో న్యూజిలాండ్‌కు చెందిన విలియం ఓ'రూర్కే మిగిలిన టోర్నీకి లక్నో సూపర్ జెయింట్స్ త‌రుపున‌ ఆడనున్నాడు.

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో ఆరు నెలల పునరావాసం తర్వాత తిరిగి వచ్చిన మయాంక్ రెండు మ్యాచ్‌ల్లో ఎనిమిది ఓవర్లలో 100 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. మొత్తం 48 బంతులు వేశాడు. COE నుండి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందిన తర్వాత మయాంక్ ఏప్రిల్ 16న లక్నో జట్టులో చేరాడు. ఆ తర్వాత ఏప్రిల్ 27న ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. ఆ తర్వాత మే 4న పంజాబ్ కింగ్స్‌తో తలపడగా.. ఆ తర్వాత మే 9న ఐపీఎల్ వాయిదా పడింది. ఇప్పుడు రెండో దశ మే 17 నుంచి ప్రారంభం కానుండగా, మయాంక్ మళ్లీ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు.

అదీ కాక‌.. ఈ సీజన్‌లో అతని వేగం గంటకు కనీసం 15 కిలోమీటర్లు తగ్గింది. బౌలింగ్ యాక్షన్‌లో మార్పు వచ్చింది. మయాంక్ గత సంవత్సరం ఐపీఎల్‌తో ఆరంగ్రేటం చేశాడు. ఆపై 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసి సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత అజిత్ అగార్కర్ మరియు గౌతమ్ గంభీర్ అతనిని బంగ్లాదేశ్ సిరీస్ కోసం భారతదేశం యొక్క T20 అంతర్జాతీయ జట్టులో చేర్చారు. సిరీస్ ముగిసే సమయానికి అతని వెన్ను గాయం పెరిగింది. అతడు NCAలో పునరావాసం ఉండి మొత్తం దేశవాళీ సీజన్‌ను కోల్పోయాడు. ఇప్పుడు మళ్లీ గాయపడ్డాడు. దీంతో అతడు ఫిట్‌గా ఎలా ప్రకటించబడ్డాడనే దానిపై సీఓఈకి ప్రశ్నలు తలెత్తాయి.

Next Story