మరికొద్ది రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇందుకోసం అన్ని ప్రాంచైజీలు మెగా వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. కప్పు కొట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు ఒక్కసారి టైటిల్‌ను ముద్దాడని పంజాబ్ కింగ్స్ ఈ సారి ఎలాగైనా టోర్నీ విజేతగా నిలవాలనే పట్టుదలతో ఉంది. వేలానికి ముందు మయాంక్ అగర్వాల్‌తో(రూ.12 కోట్లు) పాటు అర్ష్‌దీప్ సింగ్(రూ. 4 కోట్లు)ను అట్టిపెట్టుకుంది. వేలంలో శిఖర్ ధావన్, జానీ బెయిర్ స్టో, లియామ్ లివింగ్ స్టోన్, కగీసో రబాడ లాంటి స్టార్ ఆటగాళ్లను దక్కించుకుంది.
గత రెండు సీజన్లలో పంజాబ్ కెప్టెన్‌గా రాహుల్ వ్యవహరించగా.. మెగా వేలానికి అతడిని విడిచిపెట్టింది. దీంతో ఈ సారి పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్ కు అవకాశం ఇస్తారని అందరూ బావించారు. అయితే.. ప్రాంచైజీ మాత్రం మయాంక్ అగర్వాల్ వైపు మొగ్గు చూపుతుందని ఓ అధికారి వెల్లడించారు. మయాంక్‌కు కెప్టెన్సీ అప్పగించి వైస్ కెప్టెన్ బాధ్యతలు ధావన్ అప్పగిస్తే ఎలా ఉంటుందని అనే దానిపై చర్చ జరిగింది. ఈ విషయంలో ఫ్రాంచైజీలో మెజారిటీ సభ్యులు ఆమోదం తెలపడంతో త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ 2014లో ఫైనల్ మినహా మళ్లీ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది లేదు. గత మూడు సీజన్ల నుంచి చూసుకుంటే పంజాబ్ కింగ్స్ ఆరో స్థానంలో నిలుస్తూ వచ్చింది.