ఐపీఎల్ 2025కి ముందు జరిగిన మెగా వేలంలో భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ అమ్ముడుపోలేదు. అతడిని తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు. అటువంటి పరిస్థితితులలో మయాంక్ అగర్వాల్ విజయ్ హజారే ట్రోఫీ 2024-25 సీజన్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. టోర్నీలో 7 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ సాధించాడు.
ఆదివారం నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ సెంచరీ సాధించాడు. మయాంక్ అగర్వాల్ 97.48 స్ట్రైక్ రేట్‌తో 119 బంతుల్లో 116 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు కూడా బాదాడు. అతని ఇన్నింగ్స్‌తో కర్ణాటక 9 వికెట్ల తేడాతో నాగాలాండ్‌ను ఓడించింది.
టోర్నీలో మయాంక్ అగర్వాల్ ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్. అతడు 7 మ్యాచ్‌లలో 7 ఇన్నింగ్స్‌లలో 153.25 సగటు, 111.66 స్ట్రైక్ రేట్‌తో 613 పరుగులు చేశాడు. టోర్నీలో ఇప్పటివరకు అతడు 66 ఫోర్లు, 18 సిక్సర్లు కొట్టాడు.
ముంబైతో జరిగిన మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ 47 పరుగులు చేశాడు. దీని తర్వాత పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగులు మాత్రమే చేఆడు. డిసెంబర్ 26న పంజాబ్‌తో జరిగిన పోరులో మయాంక్ 139* పరుగులు చేశాడు. అరుణాచల్‌తో జరిగిన మరుసటి మ్యాచ్‌లో మయాంక్ 100 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. డిసెంబర్ 31న హైదరాబాద్‌తో కర్ణాటక తలపడింది. ఈ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ 124 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు 15 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. సౌరాష్ట్రతో జరిగిన చివరి మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీ సాధించాడు. 65 బంతుల్లో 106.15 స్ట్రైక్ రేట్‌తో 69 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి.