పారాలింపిక్స్‌.. మ‌నీశ్ న‌ర్వాల్‌కు స్వ‌ర్ణం, అదానా కు ర‌జ‌తం

Manish Narwal wins Gold Singhraj wins silver in Paralympics.టోక్యో వేదిక‌గా జ‌రుగుతున్న పారాలింపిక్స్‌లో భార‌త

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Sept 2021 10:36 AM IST
పారాలింపిక్స్‌.. మ‌నీశ్ న‌ర్వాల్‌కు స్వ‌ర్ణం, అదానా కు ర‌జ‌తం

టోక్యో వేదిక‌గా జ‌రుగుతున్న పారాలింపిక్స్‌లో భార‌త అథ్లెట్లు స‌త్తా చాటుతున్నారు. మ‌రో రెండు ప‌త‌కాలు భార‌త్ ఖాతాలో చేరాయి. పీ4 మిక్స్‌డ్ 50మీట‌ర్ల పిస్తోల్ పోటిల్‌లో మ‌నీల్ న‌ర్వాల్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. రికార్డు స్కోరుతో స్వ‌ర్ణం కైవ‌సం చేసుకున్నాడు. ఇదే పోటిలో సింఘ‌రాజ్ అదానా ర‌జ‌తం అందుకున్నాడు. దీంతో పారాలింపిక్స్‌లో భార‌త్‌ ప‌త‌కాల సంఖ్య 15కు చేరింది.

శ‌నివారం జరిగిన పీ4 మిక్స్‌డ్ 50మీట‌ర్ల పిస్తోల్ పోటిల్‌లో 19 ఏళ్ల న‌ర్వాల్ 218.2 స్కోరు చేశాడు. ఇది పారాలింపిక్స్ చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డు. దీంతో స్వ‌ర్ణం అందుకున్నాడు. ఇదే పోటిలో అదానా 216.7 స్కోరుతో ర‌జ‌తం అందుకున్నాడు. ర‌ష్యా ఆట‌గాడు సెర్గీ మ‌లెషెవ్ 196.8 స్కోర్ సాధించి కాంస్యం ప‌త‌కం గెలిచాడు. అంత‌క‌ముందు జ‌రిగిన అర్హ‌త పోటిల్లో అదానా 536 స్కోరుతో నాలుగో స్థానంలో నిలువ‌గా.. న‌ర్వాల్ 533 స్కోర్‌తో ఏడో స్థానంలో నిలిచి ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించారు. కాగా.. పైన‌ల్‌లో న‌ర్వాల్ దుమ్ములేపాడు. ప్ర‌స్తుతం న‌ర్వాల్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. మ‌నీశ్ సూప‌ర్ విక్ట‌రీ కొట్టారంటూ కేంద్ర క్రీడాశాక మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు.

Next Story