సెంచ‌రీల‌తో క‌దం తొక్కిన స్మృతి మంధాన‌, హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్‌.. టీమ్ఇండియా 317/ 8

Mandhana and Harmanpreet Kaur hit record setting hundreds.ఐసీసీ మహిళా వన్డే ప్ర‌పంచ‌కప్‌-2022లో టీమ్ఇండియా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 March 2022 5:46 AM GMT
సెంచ‌రీల‌తో క‌దం తొక్కిన స్మృతి మంధాన‌, హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్‌.. టీమ్ఇండియా 317/ 8

ఐసీసీ మహిళా వన్డే ప్ర‌పంచ‌కప్‌-2022లో టీమ్ఇండియా నేడు వెస్టిండీస్‌తో త‌ల‌ప‌డుతోంది. స్మృతి మంధాన‌(123; 119 బంతుల్లో 13పోర్లు, 2 సిక్స‌ర్లు), హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్‌(109; 107 బంతుల్లో 10పోర్లు, 2 సిక్స‌ర్లు) లు సెంచ‌రీల‌తో క‌దం తొక్కిన వేళ‌ భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. విండీస్ బౌల‌ర్లో అనిసా మ‌హ్మ‌ద్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. కాన్నెల్‌, మాథ్యూస్‌, ష‌కీరా, డాటిన్‌, ఆలియా త‌లో వికెట్ తీశారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెన‌ర్లు స్మృతి మంధాన, యస్తికా భాటియా(31)లు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 49 ప‌రుగులు జోడించారు. అయితే ఆ త‌రువాత బ్యాటింగ్‌కు వ‌చ్చిన కెప్టెన్‌ మిథాలీ రాజ్‌(5), దీప్తి శ‌ర్మ‌(15) విఫ‌లం కావ‌డంతో భార‌త్ 78 ప‌రుగుల‌కే మూడు కీల‌క వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శలో హ‌ర్మ‌న్‌, మంధాన జోడి క‌ట్టారు. తొలుత ఆచితూచి ఆడిన వీరిద్ద‌రు త‌రువాత బ్యాట్ ఝుళిపించారు. వీరిద్ద‌రు నాలుగో వికెట్‌కు 184 ప‌రుగుల భారీ భాగ‌స్వామ్యాన్ని అందించారు. శ‌త‌కం పూర్తి చేసుకున్న అనంత‌రం మంధాన ధాటిగా ఆడే క్ర‌మంగా పెవిలియ‌న్‌కు చేరింది. ఓ వైపు వ‌రుస‌గా వికెట్లు ప‌డుతున్నా హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ ధాటిగా ఆడుతూ శ‌త‌కాన్ని పూర్తి చేసుకుంది. కాగా ఈ వరల్డ్‌కప్‌ టోర్నీలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.

Next Story