మెహిదీ హసన్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు చేసిన బంగ్లా

Mahmudullah, Mehidy Hasan hit Bangladesh's highest-ever partnership in ODIs against India. టీమిండియాతో రెండో వన్డేలో బంగ్లాదేశ్ జట్టు మరోసారి మంచి ఆటతీరు కనబరిచింది.

By Medi Samrat  Published on  7 Dec 2022 11:24 AM GMT
మెహిదీ హసన్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు చేసిన బంగ్లా

టీమిండియాతో రెండో వన్డేలో బంగ్లాదేశ్ జట్టు మరోసారి మంచి ఆటతీరు కనబరిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 69 పరుగులకు 6 వికెట్లు కోల్పోయినా.. భారీ స్కోరు సాధించింది. బౌలింగ్ ఆల్ రౌండర్ మెహిదీ హసన్ సెంచరీ సాధించగా, మహ్మదుల్లా 77 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 271 పరుగులు చేసింది. మెహిదీ హసన్ 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. కేవలం 83 బంతుల్లోనే సెంచరీ చేశాడు. అతడి స్కోరులో 8 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. నసూమ్ అహ్మద్ 11 బంతుల్లో 18 పరుగులు చేశాడు.

బంగ్లాదేశ్ ఆటగాళ్లలో అనాముల్ హక్ 11 పరుగులు చేయగా, కెప్టెన్ లిట్టన్ దాస్ 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. షకీబల్ హసన్ 8 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో అవుటయ్యాడు. నజ్ముల్ హుస్సేన్ శాంటో 21, ముష్ఫికర్ రహీమ్ 12 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3, సిరాజ్ 2, ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు తీశారు.


Next Story
Share it