IPL-2023 : హైద్రాబాద్‌కు వ‌రుస‌గా రెండో ఓట‌మి.. మార్క్‌రామ్ ఏమ‌న్నాడంటే..

Lucknow Super Giants won by 5 wkts. లక్నో సూప‌ర్ జెయింట్స్‌ ఏకనా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత

By Medi Samrat  Published on  8 April 2023 2:12 AM GMT
IPL-2023 : హైద్రాబాద్‌కు వ‌రుస‌గా రెండో ఓట‌మి.. మార్క్‌రామ్ ఏమ‌న్నాడంటే..

లక్నో సూప‌ర్ జెయింట్స్‌ ఏకనా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. హైద్రాబాద్ ఆట‌గాళ్ల‌లో ఎవ‌రూ చెప్పుకోద‌గ్గ ఆట‌తీరు క‌న‌బ‌ర్చ‌లేదు. అనంతరం లక్నో జ‌ట్టు 16 ఓవర్లలో 127 ప‌రుగుల‌కు 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ కృనాల్ పాండ్యా బౌలింగ్‌( 3 వికెట్లు), బ్యాటింగ్‌(34 ప‌రుగులు) రెండింటిలో రాణించాడు. కెప్టెన్ రాహుల్ కూడా 35 పరుగులు చేశాడు.

మ్యాచ్ ముగిసిన అనంత‌రం.. కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ ఐడెన్ మార్క్రామ్ మాట్లాడుతూ.. "మేము 150-160 స్కోర్ చేయాలని చూశాం.. కానీ చేయలేకపోయాము. వికెట్ బాగుంది. లక్నో జ‌ట్టు చాలా బాగా బౌలింగ్ చేసింది. మేం బాగా ఆడలేదు. మా బౌలర్లు ప్రయత్నించారు. 30-40 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. తదుపరి మ్యాచ్‌లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఆ మ్యాచ్‌కి మేం సిద్ధంగా ఉంటామ‌ని అన్నాడు.

తదుపరి మ్యాచ్‌లో హోంగ్రౌండ్‌లో పరిస్థితులను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తానని మార్క్రామ్ తెలిపాడు. పంజాబ్ కింగ్స్ పై విజయం సాధిస్తామ‌ని పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నా.. మేము వారిని ఓడించే అవకాశం ఉంది. జట్టుతో పాటు ఆటగాళ్లు తదుపరి మ్యాచ్‌కి సిద్ధంగా ఉంటామ‌న్నారు. ఈ విజయంతో లక్నో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మూడు మ్యాచ్‌లు ఆడి 4 పాయింట్లతో మొద‌టిస్థానంలో ఉంది. పాయింట్ల పట్టికలో హైదరాబాద్ జట్టు ఖాతా ఇంకా తెరవలేదు.


Next Story