సెమీస్‌లో ఓడిన ల‌వ్లీనా.. కాంస్యంతో సరి

Lovlina settles for Bronze in Tokyo Olympics.టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియ‌న్ బాక్స‌ర్ లవ్లీనా బోర్గొహైన్ సంచ‌నాల‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Aug 2021 11:48 AM IST
సెమీస్‌లో ఓడిన ల‌వ్లీనా.. కాంస్యంతో సరి

టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియ‌న్ బాక్స‌ర్ లవ్లీనా బోర్గొహైన్ సంచ‌నాల‌కు తెర‌ప‌డింది. 64-69 కేజీల విభాగంలో బుధ‌వారం జ‌రిగిన సెమీఫైన‌ల్లో ఆమె ఓట‌మి పాలైంది. ట‌ర్కీ బాక్స‌ర్, ప్ర‌పంచ ఛాంపియ‌న్ సుర్మెనెలి చేతిలో 0-5తేడాతో ప‌రాజ‌యం పాలైంది. మూడు రౌండ్ల‌లోనూ ట‌ర్కీ బాక్స‌ర్ పూర్తి ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. దీంతో ఐదుగురు జ‌డ్జీలు ఏక‌గ్రీవంగా ట‌ర్కీ బాక్స‌ర్‌ను విజేత‌గా తేల్చారు. ఈ మ్యాచ్‌లో ఓడిన‌ప్ప‌టికి ల‌వ్‌లీనా కాంస్య ప‌త‌కం సొంతం చేసుకుంది. దీంతో ఒలింపిక్స్‌లో ప‌త‌కం సాధించిన మూడో బాక్స‌ర్‌గా లవ్లీనా చ‌రిత్ర సృష్టించింది.

లవ్లీనా కాంస్యం గెలుచుకోవడంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ సాధించిన పతకాల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటికే వెయిట్‌ లిఫ్టర్‌ మీరా బాయి చాను రజతం, షట్లర్‌ పీవీ సింధు కాంస్య పతకం గెలుచుకున్న విషయం తెలిసిందే.

అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం

అంత‌క‌ముందు.. అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ల‌వ్లీనా మ్యాచ్‌ను వీక్షించేందుకు అసెంబ్లీని వాయిదా వేయాలని నిర్ణయించింది. చారిత్రాత్మక స్వర్ణ పతకం సాధించాలని కోరకుంటూ తమ అభిమాన బాక్సర్‌ని ప్రత్యక్షంగా చూడటానికి అనుమతించాలని డిప్యూటీ స్పీకర్ నుమాల్ మోమిన్ స్పీకర్ బిశ్వజిత్ డైమరీని అభ్యర్థించినట్లు సంబంధిత అధికారి తెలిపారు. బౌట్ ముగిసిన తర్వాత, అసెంబ్లీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఇందుకోసం లైవ్‌ టెలికాస్ట్‌ను ఏర్పాటు చేశారు. తద్వారా సభలోని సభ్యులందరూ, అసెంబ్లీ సిబ్బంది దీన్ని వీక్షించవచ్చు. అస్సాం నుంచి ఒలింపిక్ పతకం సాధించిన తొలి క్రీడాకారిణి, అలాగే ఒలింపిక్స్‌లో పాల్గొన్న రాష్ట్రం నుండి మొదటి మహిళా అథ్లెట్ కూడా లవ్లీనే కావడం విశేషం.

Next Story