భార‌త బాక్స‌ర్ సంచ‌ల‌నం.. పతకానికి పంచ్‌ దూరమే

Lovlina Borgohain makes quarterfinals of Olympic.టోక్యో ఒలింపిక్స్‌లో భార‌త బాక్స‌ర్ ల‌వ్లీనా బొర్గొహైన్ సంచ‌ల‌నం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 July 2021 10:09 AM GMT
భార‌త బాక్స‌ర్ సంచ‌ల‌నం.. పతకానికి పంచ్‌ దూరమే

టోక్యో ఒలింపిక్స్‌లో భార‌త బాక్స‌ర్ ల‌వ్లీనా బొర్గొహైన్ సంచ‌ల‌నం సృష్టించింది. బాక్సింగ్ మహిళల 69 కిలోల విభాగంలో లవ్లీనా సత్తా చాటింది. ఫ్రీ క్వార్టర్స్ రెండో రౌండ్ లో జర్మన్‌కి చెందిన నదైన్ ఆప్టెజ్‌ను 3-2 తేడాతో ఓడించిన లవ్‌లీనా క్వార్టర్ ఫైనల్ లోకి దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో గెలిస్తే ఆమె కనీసం కాంస్య పతకం అందుకోనుంది. కాగా.. తొలి రౌండ్‌లో ల‌వ్లీనాకు బై ల‌భించ‌డం గ‌మ‌నార్హం.

కాగా.. మంగ‌ళ‌వారం భార‌త్ నుంచి పోటిప‌డిన ఏకైక బాక్స‌ర్ ల‌వ్లీనా మాత్ర‌మే. తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడిన ఆమె.. బలమైన ప్రత్యర్థిపై పోరాటపటిమ చూపించి గెలుపొందారు. మూడు రౌండ్లలోనూ ల‌వ్లీనా ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. మూడు రౌండ్ల‌లోనూ ముగ్గురు జ‌డ్జీలు ల‌వ్లీనాకు 10 స్కోరు ఇవ్వ‌గా.. ఇద్ద‌రు 9 ఇచ్చారు. చివ‌రికి 3-2తో గెలిచి త‌ర్వాతి రౌండ్‌లో అడుగుపెట్టింది. వీరిద్ద‌రికి యాదృచ్చికంగా ఇదే తొలి ఒలిపింక్స్ కావ‌డం విశేసం. జ‌ర్మ‌నీ నుంచి ఒలింపిక్స్‌కు ఎంపికైన తొలి బాక్స‌ర్ ఆప్టెజ్‌. రెండు సార్లు ప్ర‌పంచ చాంపియ‌న్‌షిప్స్‌లో కాంస్యం గెలిచింది. ఇక లవ్లీనాకూ సైతం రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్‌లో కాంస్యాలు గెలిచిన అనుభ‌వం ఉంది.

Next Story
Share it